logo

బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం : శ్రీభరత్‌

తెదేపా కూటమి ప్రభుత్వంలో బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని, గవర సామాజిక వర్గానికి పెద్దపీట వేసిన ఘనత తెదేపాకే దక్కుతుందని విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌ అన్నారు.

Published : 09 May 2024 04:17 IST

గాజువాక, న్యూస్‌టుడే : తెదేపా కూటమి ప్రభుత్వంలో బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని, గవర సామాజిక వర్గానికి పెద్దపీట వేసిన ఘనత తెదేపాకే దక్కుతుందని విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌ అన్నారు. బుధవారం 70వ వార్డు శ్రామికనగర్‌లో గాజువాక పట్టణ గౌరీ సంఘాల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీభరత్‌ మాట్లాడుతూ... వైకాపా అయిదేళ్ల పాలనలో గవర సామాజిక వర్గం మోసానికి గురైందని, ఈ ఎన్నికల్లో వైకాపాకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ... భావితరాల భవిష్యత్తుకు ప్రతి ఒక్కరూ తెదేపా కూటమికి మద్దతు పలకాలన్నారు. గవర సంఘం నాయకుడు కేవీఎస్‌ శంకరరావు అధ్యక్షత వహించారు. సభ్యులు రమణ, నాయుడు, పెంటారావు, వెంకట అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని