logo

ఉద్యోగం వచ్చేంత వరకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి

పెందుర్తి నియోజకవర్గం కూటమి అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబుకు సబ్బవరం మండలం ప్రజలు గురువారం బ్రహ్మరథం పట్టారు. నారపాడు, నల్లరేగులపాలెం, బల్జిపాలెం, బాటజంగాలపాలెం, గణపతినగర్‌, అసకపల్లి, ఎరుకునాయుడుపాలెం, పైడివాడ అగ్రహారం గ్రామాల్లో సుడిగాలి ప్రచారం నిర్వహించారు.

Published : 10 May 2024 04:22 IST

బాటజంగాలపాలెంలో మాట్లాడుతున్న జనసేన అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబు

సబ్బవరం, న్యూస్‌టుడే: పెందుర్తి నియోజకవర్గం కూటమి అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబుకు సబ్బవరం మండలం ప్రజలు గురువారం బ్రహ్మరథం పట్టారు. నారపాడు, నల్లరేగులపాలెం, బల్జిపాలెం, బాటజంగాలపాలెం, గణపతినగర్‌, అసకపల్లి, ఎరుకునాయుడుపాలెం, పైడివాడ అగ్రహారం గ్రామాల్లో సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీల్లో డబ్బులు లాగేసుకున్న జగన్‌కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. కూటమి అధికారంలోకి రాగానే 19 నుంచి 59 ఏళ్లలోపు మహిళల ఖాతాల్లో నెలకు రూ.1500 జమ, ఉచితంగా 3 గ్యాస్‌ సిలెండర్లు, పింఛను నెలకు రూ.4 వేలు ఇస్తామన్నారు. రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని లేకుంటే ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్నారు. కూటమి నేతలు గండి వంశీదీప్‌, పడాల వెంకటరమణ, మామిడి శంకర్రావు, పి.శ్రీను, బొబ్బరి కన్నారావు, అక్కిరెడ్డి దుర్గినాయుడు తదితరులు పాల్గొన్నారు.

పంచకర్లకు పాస్టర్ల మద్దతు: సబ్బవరం మండలంలోని వివిధ చర్చిల పాస్టర్లు వరప్రసాద్‌, జి.జోసెఫ్‌రాజు, పి.మనోహర్‌, వి.చేలాజ్‌, కె.మనోహర్‌ తదితర 30 మంది పంచకర్ల రమేశ్‌బాబుకు ఆయన సోదరుడు వెంకటేశ్వరరావు సమక్షంలో మద్దతు తెలిపారు. అనకాపల్లి భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌కు కూడా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు ప్రకటించారు. సాలాపు వెంకటటేశ్వరరావు, బంతికోళ్ల పద్మ, ఇందల వెంకటరమణ, మిడతాడ మహాలక్ష్మినాయుడు, కేవీ రమణ, గొర్లి ప్రసాద్‌, జెట్టి ప్రసాద్‌, తీడ రవి, కర్రి కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని