logo

పోలింగ్‌ బృందాల తరలింపునకు.. 800 వాహనాలు

పోలింగ్‌ బృందాలను ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానం నుంచి తరలించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. ఈనెల 11వ తేదీ సాయంత్రం 6గంటలతో ప్రచార ఘట్టం పరిసమాప్తం కానుంది.

Published : 10 May 2024 04:36 IST

ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో చేస్తున్న ఏర్పాట్లు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: పోలింగ్‌ బృందాలను ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానం నుంచి తరలించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. ఈనెల 11వ తేదీ సాయంత్రం 6గంటలతో ప్రచార ఘట్టం పరిసమాప్తం కానుంది. 12న ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ బృందాలు నిర్దేశిత పోలింగ్‌ కేంద్రాలకు బయలుదేరి వెళ్లనున్నాయి. ఈ మేరకు 800కుపైగా వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ఆర్టీసీ బస్సులు 500కుపైగా ఉన్నాయి. కార్లు, వ్యాన్లు, ఇతర వాహనాలను రప్పిస్తున్నారు. ఒక్కో పోలింగ్‌ బృందంలో ఆరుగురు చొప్పున సభ్యులుంటారు. జిల్లాలోని 1,941 పోలింగ్‌ కేంద్రాలను రూట్లు, సెక్టార్లుగా విభజించి ప్రత్యేక వాహనాల్లో తరలిస్తారు. అక్కడ సిబ్బందికి అల్పాహారం, మధ్యాహ్నం భోజనాలు ఇవ్వనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు