logo

Medaram Jathara: నేడు విద్యాసంస్థలకు సెలవు

మేడారం సమ్మక్క, సారమ్మల జాతర సందర్భంగా జనగామ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్‌ శివలింగయ్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ

Updated : 18 Feb 2022 07:41 IST

జనగామ టౌన్‌, న్యూస్‌టుడే: మేడారం సమ్మక్క, సారమ్మల జాతర సందర్భంగా జనగామ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్‌ శివలింగయ్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా నడుస్తాయని, కేవలం ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ సెలవుకు బదులుగా మార్చి 12న రెండో శనివారం పనిదినంగా పాటించాలని తెలిపారు.
కేయూ పరిధిలో...
వరంగల్‌ విద్యావిభాగం : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను పురస్కరించుకొని శుక్రవారం కాకతీయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌తో పాటు ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ డిగ్రీ, పీజీ కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య బి.వెంకట్రాంరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 12వ తేదీ రెండో శనివారం రోజు పనిదినంగా నిర్ణయించినట్లు చెప్పారు. అధికారులు, ప్రిన్సిపాళ్లు, విద్యార్థులు గమనించాలని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని