logo

వజ్రోత్సవ సంబరం..

స్వాతంత్య్రం సిద్ధించిన తొలి నాళ్లలో మన అక్షరాస్యత ఆరు శాతమే. ఇప్పుడు సగటున 70 శాతం. 75 వసంతాల్లో ఉమ్మడి వరంగల్‌ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి ఫలాలు సాధించింది. స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే 2021-22 ప్రకారం మన ప్రగతి చక్రంపై ప్రత్యేక కథనం..

Updated : 10 Aug 2022 05:11 IST

ఈనాడు, వరంగల్‌, డోర్నకల్‌, న్యూస్‌టుడే

స్వాతంత్య్రం సిద్ధించిన తొలి నాళ్లలో మన అక్షరాస్యత ఆరు శాతమే. ఇప్పుడు సగటున 70 శాతం. 75 వసంతాల్లో ఉమ్మడి వరంగల్‌ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి ఫలాలు సాధించింది. స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే 2021-22 ప్రకారం మన ప్రగతి చక్రంపై ప్రత్యేక కథనం..

* కాకతీయ విశ్వవిద్యాలయంతోపాటు, జాతీయ సాంకేతిక సంస్థ (నిట్) మన దగ్గర ఉంది. వైద్య విద్యార్థుల కోసం కాకతీయ వైద్య కళాశాల ఒకటే ఉండేది. ఇప్పుడు అన్ని జిల్లాల్లో ఏర్పాటవుతున్నాయి.  
* రవాణారంగం ఎంతో అభివృద్ధి చెందింది. కాజీపేట, వరంగల్‌తోపాటు ఎన్నో రైల్వే స్టేషన్లు, ఉత్తర దక్షిణ భారతాన్ని కలిపేలా కాజీపేట జంక్షన్‌గా  మారింది. మొత్తం 9 బస్సు డిపోలు ఉన్నాయి. అనేక జాతీయ రహదారులు ఉమ్మడి వరంగల్‌ గుండా వెళుతున్నాయి. త్వరలో భారత్‌మాలా పరియోజన్‌ కింద నాగ్‌పూర్‌ నుంచి విజయవాడ వరకు ఎక్స్‌ప్రెస్‌ మార్గం రానుంది. మామునూరు విమానాశ్రయం ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది.


విద్యారంగం అభివృద్ధి పథం

ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో నామమాత్ర వసతులు ఉండేవి. ఇప్పుడు విద్యారంగంలో పెనుమార్పులు వచ్చాయి.


అక్షరాస్యత మెరుగు

ఉమ్మడి వరంగల్‌ జిల్లా అక్షరాస్యత 65.11 శాతం. ఆరేళ్లు పైబడిన జనాభాలో మహబూబాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల అక్షరాస్యత 60 శాతం లోపు ఉంది. హనుమకొండ జిల్లాలో మెరుగ్గా ఉంది.


చదువే కీలకం

- తాటికొండ రమేశ్‌, ఉపకులపతి, కాకతీయ విశ్వవిద్యాలయం

ఏ సమాజమైనా దేశమైనా ప్రగతి సాధించాలంటే విద్యే కీలకం. ఇప్పుడు మన దేశంలోని యువత అద్భుతాలు సాధిస్తున్నారంటే విద్యా రంగ ప్రగతి వల్లే. దీనికి నిధులు మరిన్ని పెంచితే వందశాతం అక్షరాస్యత, మరింత ప్రగతి సాకారం అవుతుంది.


ఓరుగల్లు ప్రగతి సంతకం

* వైద్యం పేదలకు చేరువయ్యింది. బోధనాసుపత్రి ఎంజీఎంతోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో జిల్లా ఆసుపత్రులు, పీహెచ్‌సీలు ఉన్నాయి. కేఎంసీలో ఇప్పటికే సూపల్‌ స్పెషాలిటీ ఆసుపత్రి రాగా త్వరలో 24 అంతస్తుల అత్యాధునిక ఆసుపత్రిని ప్రభుత్వం నిర్మిస్తోంది.
* వ్యవసాయ రంగంలో గణనీయమైన ప్రగతి సాధిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు, దేవాదుల లాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు మన వద్దే కొలువై ఉన్నాయి. వీటి ద్వారా లక్షలాది ఎకరాలకు సాగు, తాగు నీరు అందుతోంది.
* పారిశ్రామిక విప్లవం పెద్ద ఎత్తున సాగుతోంది. వేలాది ఎంఎస్‌ఎంఈలు ఆరు జిల్లాల్లో ఏర్పాటయ్యాయి. ఐటీ పరిశ్రమలకు నిలయంగా ఓరుగల్లు నగరంలో అనేక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఏర్పాటయ్యాయి. మెగా జౌళి పార్కు కూడా రూపుదిద్దుకుంటోంది.  
* ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు ఉమ్మడి వరంగల్‌ నుంచి ఆరు జిల్లాలు ఏర్పాటయ్యాయి. వాటిల్లో ఆధునిక పాలనా కేంద్రాలను నిర్మించారు. వరంగల్‌ మహానగరం దేశంలోనే మూడు పథకాలు మంజూరైన ఏకైక నగరంగా ఘనత సాధించింది.


ఇంటింటా విద్యుత్తు

స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో కిరోసిన్‌ బుడ్లు వెలిగించిన ఇళ్లు అనేకం. ఇప్పుడు అవి కనుమరుగయ్యాయి. మెరుగైన విద్యుత్తు ఉమ్మడి జిల్లా వాసులకు అందుతుంది.


అన్నదాతకు జేజేలు

మిషన్‌ కాకతీయతో చెరువులు కుంటల అభివృద్ధి, కాళేశ్వరం, ఎస్సారెస్సీ కాల్వల ద్వారా ఊరూరా చేరిన గోదావరి నీళ్లతో నీటి వనరుల్లో ఇప్పుడు పుష్కలమైన నీరు. దీంతో వ్యవసాయం సస్యశ్యామలం అవుతోంది.


 పారిశ్రామిక వేత్తలుగా

ఉమ్మడి జిల్లా నుంచి ఎందరో పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. అనామికా పాండే ఎన్‌ఐటీ పూర్వ విద్యార్థిని. ఉత్తరప్రదేశ్‌లోని వాస్తుఖండ్‌. ఇంట్లో తయారు చేసే మసాలాలతో ‘నారియో’ అనే అంకుర సంస్థను స్థాపించారు. అది రూ.కోట్ల టర్నోవర్‌కు చేరుకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని