logo

‘రాబందుల చేతిలో రాష్ట్రం విలవిల’

‘అధిక పన్నుల వసూళ్లతో అటు కేంద్ర ప్రభుత్వం.. కచ్చితమైన ప్రణాళిక లేని పనులకు కోట్లాది రూపాయలు వృథాగా ఖర్చు చేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వం.. నిరుపేదలపై పెను భారం మోపుతూ ప్రజలపై రాబందుల్లా విరుచుకుపడుతున్నాయని

Published : 14 Aug 2022 05:58 IST

పాదయాత్ర చేస్తున్న ఎమ్మెల్యే సీతక్క, టీపీసీసీ కార్యదర్శి అశోక్‌, శ్రేణులు

గోవిందరావుపేట, న్యూస్‌టుడే: ‘అధిక పన్నుల వసూళ్లతో అటు కేంద్ర ప్రభుత్వం.. కచ్చితమైన ప్రణాళిక లేని పనులకు కోట్లాది రూపాయలు వృథాగా ఖర్చు చేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వం.. నిరుపేదలపై పెను భారం మోపుతూ ప్రజలపై రాబందుల్లా విరుచుకుపడుతున్నాయని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. ఆజాదీకా గౌరవ యాత్ర నాలుగో రోజైన శనివారం మండలంలోని చల్వాయి గ్రామానికి చేరుకుంది. సీతక్కకు ప్రజలు మంగళహారతులిచ్చి స్వాగతం పలికారు. గోవిందరావుపేటలో కాంగ్రెస్‌ పార్టీ జెండా ఆవిష్కరించి ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ.. వివిధ రూపాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను తీవ్ర ఇబ్బందుల పాల్జేస్తున్నాయన్నారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం దేశంలోని సంపదనంతా కార్పొరేట్‌ శక్తులకు అప్పనంగా దోచిపెడుతూ ప్రజల బాగోగులను గాలికి వదిలేసిందన్నారు. ప్రజలకు విముక్తి కలిగించేందుకు కాంగ్రెస్‌ పార్టీ కృషి చేస్తోందన్నారు. అందుకే వజ్రోత్సవ సంబరాలకు బదులు పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ హామీలను గాలికి వదిలేశారన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీనే ప్రజలు దీవించి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి, టీపీసీసీ అధికార ప్రతినిధి రవళి, టీపీసీసీ కార్యదర్శి అశోక్‌, నాయకులు సీహెచ్‌.నారాయణరెడ్డి, ఎం.రాంరెడ్డి, జి.రాజేందర్‌గౌడ్‌, కరంచంద్‌ గాంధీ, జి.సోమయ్య, డి.సుధాకర్‌, కె.ధనలక్ష్మీ, అయుబ్‌ఖాన్‌, కె.రవి, ఎండీ.చాంద్‌పాషా, సీహెచ్‌.సూర్యనారాయణ, అనంతరెడ్డి, సీహెచ్‌.రఘు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని