logo

పోలవరం ఎత్తు పెంచడంపై ప్రభుత్వాలు చోద్యం

లక్షల ఆదివాసీ కుటుంబాలు జలసమాధి అయ్యేలా పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచడాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యంగా చూస్తున్నాయని, ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని ఆదివాసీ హక్కుల పోరాట సమితి(తుడుందెబ్బ) రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు మైపతి అరుణ్‌కుమార్‌,

Published : 26 Sep 2022 04:53 IST

గోడపత్రికలు ఆవిష్కరిస్తున్న తుడుందెబ్బ నాయకులు

తాడ్వాయి, న్యూస్‌టుడే: లక్షల ఆదివాసీ కుటుంబాలు జలసమాధి అయ్యేలా పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచడాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యంగా చూస్తున్నాయని, ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని ఆదివాసీ హక్కుల పోరాట సమితి(తుడుందెబ్బ) రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు మైపతి అరుణ్‌కుమార్‌, ప్రచార కార్యదర్శి ఆలెం కోటి పేర్కొన్నారు. మండలంలోని రంగాపురంలో జరిగిన తుడుందెబ్బ సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టు పూర్తయితే ఐదువేల చదరపు కిలోమీటర్ల పరిధిలోని ఆదివాసీ గ్రామాలు, 2 లక్షల జనాభా నిర్వాసితులయ్యే ప్రమాదం ఉందన్నారు. భద్రాద్రి రాముడి ఆలయం సైతం మునిగిపోయే అవకాశం ఉందన్నారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. అనంతరం ఈ నెల 30న భద్రాచలంలో నిర్వహించనున్న సంఘం సదస్సు గోడపత్రికలను ఆవిష్కరించారు. సర్పంచి ఇర్ప అశ్విని, సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎట్టి ప్రకాష్‌, కార్యదర్శులు జువ్వాజి మోహన్‌రావు, ఇర్ప ప్రభాకర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని