logo

శ్రీభద్రకాళి కల్యాణ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

ఓరుగల్లు నగరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీభద్రకాళి దేవస్థానంలో భద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలకు గురువారం అంకురార్పణ జరిగింది.

Published : 10 May 2024 02:05 IST

కల్యాణ బ్రహ్మోత్సవాలను జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న జిల్లా మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు

రంగంపేట, న్యూస్‌టుడే: ఓరుగల్లు నగరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీభద్రకాళి దేవస్థానంలో భద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలకు గురువారం అంకురార్పణ జరిగింది. తెల్లవారుజామున నిత్యాహ్నికం అమ్మవారి నుంచి ఉత్సవాంగీకార ప్రార్థన జరిపారు. ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకుల మంత్రోచ్ఛరణాలతో శ్రీభద్రకాళి అమ్మవారికి పూర్ణాబిషేకం నిర్వహించారు. ఉదయం 11 గంటలకు గణపతి సేవ, సాయంత్రం శ్రీ సుబ్రహ్మణ్య సేవ జరిగింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా మున్నూరు కాపు సంఘం నాయకులు ఉభయ దాతలుగా వ్యవహరించారు. సంఘం ప్రతినిధులు కటకం పెంటయ్య, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌, కొండ దేవయ్య, రవికుమార్‌, రాజ్‌కుమార్‌, శ్రీధర్‌, కుమారస్వామి తదితరులు అమ్మవారికి పట్టు చీరలు, పూజా ద్రవ్యాలు అందజేశారు. అంతకుముందు ద్వజస్తంభం వద్ద కల్యాణ బ్రహ్మోత్సవాలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. 10రోజుల పాటు జరిగే కల్యాణ బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తుల కోసం అన్ని వసతులు కల్పించినట్లు ఈఓ శేషుభారతి తెలిపారు. ఎస్బీఐ వరంగల్‌ రీజినల్‌ మేనేజర్‌ విష్ణువర్థన్‌, బ్రాంచి మేనేజర్‌ భిక్షపతి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ నెల 12న జరిగే కల్యాణోత్సవానికి తలంబ్రాల బియ్యం అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని