logo

దేశ సంపద అంబానీ, అదానీల చెంత..

దేశ సంపదను కేంద్రంలోని భాజపా అంబానీ, అదానీలకు దోచిపెట్టి, పన్నులను ప్రజలపై మోపుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు.

Published : 10 May 2024 02:11 IST

మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, చిత్రంలో భువనగిరి ఎంపీ అభ్యర్థి జహంగీర్‌

జనగామ టౌన్‌, న్యూస్‌టుడే: దేశ సంపదను కేంద్రంలోని భాజపా అంబానీ, అదానీలకు దోచిపెట్టి, పన్నులను ప్రజలపై మోపుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం సీపీఎం అభ్యర్థి ఎండి.జహంగీర్‌ గెలుపు కోరుతూ జనగామ పట్టణంలోని పలు ప్రాంతాల్లో సీపీఎం ఆధ్వర్యంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీబాయికుంట వద్ద అభ్యర్థి జహంగీర్‌తో కలిసి తమ్మినేని రోడ్డుషో నిర్వహించి కూడలి సమావేశంలో ప్రసంగించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ ప్రధాని మోదీ నియంతలా పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ పార్టీ పాలనలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర ధరలను పెంచి సామాన్య ప్రజలను ఆర్థికంగా హింసిస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో ఆ పార్టీ మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తీసివేస్తుందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న జహంగీర్‌ను భువనగిరి ప్రజలు గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.అబ్బాస్‌, జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, నాయకులు శ్రీకాంత్‌, రాపర్తి రాజు, సాంబరాజు యాదగిరి, ఇర్రి అహల్య, రమేష్‌, జోగు ప్రకాష్‌, బూడిద గోపి, విజేందర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు