logo

మరో అయిదు బడుల్లో పీఎంశ్రీ శ్రీకారం

విద్యార్థుల సంఖ్య, పాఠశాలల్లో మౌలిక వసతులను గమనంలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఈయేడాది జిల్లాలో మరో అయిదు పాఠశాలలను పీఎంశ్రీ (ప్రధాన మంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌) పథకానికి ఎంపిక చేసింది.

Published : 10 May 2024 02:12 IST

ఎంపికైన నర్మెట్ట ఆదర్శ పాఠశాల

దేవరుప్పుల (జనగామ జిల్లా), న్యూస్‌టుడే: విద్యార్థుల సంఖ్య, పాఠశాలల్లో మౌలిక వసతులను గమనంలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఈయేడాది జిల్లాలో మరో అయిదు పాఠశాలలను పీఎంశ్రీ (ప్రధాన మంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌) పథకానికి ఎంపిక చేసింది. దీంతో వాటి రూపురేఖలే మారనున్నాయి.

ఏం ప్రయోజనమంటే: ఎంపిక చేసిన ఈ పాఠశాలలకు కార్పొరేట్‌ స్కూల్స్‌ తరహాలో మౌలిక వసతులు కల్పిస్తారు. విద్యుత్‌ సౌకర్యం మంచినీటి వసతులు మెరుగుపరుస్తారు. సామాన్యశాస్త్ర ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తారు. స్థానికంగా మంచి ఆదరణ ఉన్న వృత్తివిద్యాకోర్సులను ప్రారంభిస్తారు. విద్యార్థులకు పదో తరగతి తర్వాత ఉన్నత విద్య లేదా జీవితంలో స్థిరపడాలంటే ఏఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయో నిపుణులతో అతిథేయ ప్రసంగాలు ఇప్పిస్తారు. విద్యార్థులు విజ్ఞాన యాత్రలు నిర్వహించడంతో పాటు గణిత సామాన్యశాస్త్రాల పాఠ్యాంశాలకు సంబంధించి విలువైన బోధనోపకరణాలను అందిస్తారు. విద్యార్థుల మానసికోల్లాసానికి వివిధ రకాల ఆటలు కావాల్సినన్ని పుస్తకాలున్న గ్రంథాలయాల ఏర్పాటు సహా విద్యార్థుల ఆసక్తులకు తగినట్లు క్రీడా పరికరాలు సమకూరుస్తారు. వీటికి ప్రతి పాఠశాలకు రూ.40 లక్షల మేర ఖర్చుచేస్తారు.

ప్రధానోపాధ్యాయులేమంటున్నారంటే: విద్యార్థులకు ఉపయోగపడే క్రీడా కిట్లు సహా విజ్ఞాన విహార యాత్రలకు సంబంధించిన సొమ్ములను వీలైనంత త్వరగా అందించాలి. నిరుడు (2023-24) విద్యా సంవత్సరంలో పాఠశాలలకు వేసవి సెలవుల ముందు నిధులు విడుదల చేయడంతో విహార యాత్రలు అనుకున్నంత సమర్ధంగా నిర్వహించలేక పోయారు. కెరీర్‌ గైడెన్స్‌కు సంబంధించి ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలో నిర్వహించే విధంగా క్యాలెండర్‌ ఖరారు చేసి నిధులను అందించాలని సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు