logo

భారాస హయాంలో ముస్లింలకు అత్యంత ప్రాధాన్యం

పరకాల, గీసుకొండ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ముస్లింలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ భారాస అని మాజీ హోం మంత్రి మహమూద్‌ అలీ అన్నారు.

Updated : 10 May 2024 05:53 IST

ప్రసంగిస్తున్న మాజీ హోం మంత్రి మహమూద్‌ అలీ

హనుమకొండ చౌరస్తా, కొడకండ్ల: పరకాల, గీసుకొండ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ముస్లింలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ భారాస అని మాజీ హోం మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. వివాహాలు చేసుకున్న ముస్లిం యువతులకు షాదీ ముబారక్‌ ద్వారా ఆర్థిక సాయం అందించిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారాస జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్‌ ఆధ్వర్యంలో హనుమకొండ పార్టీ కార్యాలయంలో ముస్లిం, మైనారిటీ, సిక్కు సోదరులతో గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మహమూద్‌ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది కాలంలోనే అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందన్నారు. ఎంపీ అభ్యర్థి సుధీర్‌కుమార్‌ మాట్లాడుతూ బడేభాయి ప్రధాని మోదీ, చోటే భాయి రేవంత్‌రెడ్డి ఓటమి భయంతోనే వరంగల్‌ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు. వరంగల్‌ ఎంపీగా గెలిపిస్తే దేశానికే ఒక దిక్సూచిలా పని చేస్తానన్నారు.  మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సుధీర్‌కుమార్‌ గెలుపు కాంక్షిస్తూ గురువారం కొడకండ్ల మండలం రేగుల, రేగుల తండ, రంగాపురం, ఏడునూతుల, నర్సింగాపురం గ్రామాల్లో ప్రచార సభలు నిర్వహించారు. భారాసలో చేరిన వారికి దయాకర్‌రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  పరకాలలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుధీర్‌కుమార్‌, శాసనమండలి ఉపాధ్యక్షుడు బండా ప్రకాశ్‌, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడారు.  వరంగల్‌ స్థానంలో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌, భాజపాలకు అభ్యర్థులు లేకపోవడంతో భారాసకు చెందిన కావ్య, రమేష్‌లకు లాక్కొని టికెట్లు కేటాయించడం దివాళా కోరు రాజకీయాలకు నిదర్శనమని,  లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని శాసనమండలి ఉపాధ్యక్షుడు బండా ప్రకాష్‌ అన్నారు. గీసుకొండ మండలం కొనాయమాకులలోని వేడుకల మందిరంలో గురువారం జరిగిన లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన ప్రసంగించారు.  ఎంపీ అభ్యర్థి  సుధీర్‌కుమార్‌, జడ్పీటీసీ సభ్యుడు ధర్మారావు, వరంగల్‌ మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ సదానందం, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని