logo

36.69 శాతమే హాజరు

సంక్రాంతి సెలవుల అనంతరం తొలిరోజు 36.69 శాతం మంది విద్యార్థులు మాత్రమే పాఠశాలలకు హాజరయ్యారు. జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో మొత్తం 3,28,334 మంది చదువుతున్నారు. సాధారణ రోజుల్లో సుమారు 2.80 లక్షల మంది హాజరవుతుంటారు.

Updated : 18 Jan 2022 05:07 IST

పరింపూడి ప్రాథమిక పాఠశాలకు హాజరైన ఒకే ఒక విద్యార్థి

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: సంక్రాంతి సెలవుల అనంతరం తొలిరోజు 36.69 శాతం మంది విద్యార్థులు మాత్రమే పాఠశాలలకు హాజరయ్యారు. జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో మొత్తం 3,28,334 మంది చదువుతున్నారు. సాధారణ రోజుల్లో సుమారు 2.80 లక్షల మంది హాజరవుతుంటారు. సంక్రాంతి సెలవులు ముగియడంతో సోమవారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. బంధువుల ఇళ్లకు వెళ్లడంతో కొంతమంది హాజరు కాలేకపోయారు. మరోవైపు కొవిడ్‌ మూడో దశ హెచ్చరికల నేపథ్యంలో మరికొంతమంది రాలేదు. సోమవారం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ బడులకు 1,17,193 మంది మాత్రమే హాజరయ్యారు. ఇందులో 1,08,129 మంది మధ్యాహ్న భోజనం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని