logo

యనమదుర్రుకు వరద నీరు

అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని మురుగుకాలువల్లో ప్రవాహం పెరుగుతోంది. యనమదుర్రు డ్రెయిన్‌లోకి ఎర్రకాలువ వరద నీటిని వదలడంతో తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరు, ఉండి, భీమవరం నియోజకవర్గాల పరిధిలో యంత్రాంగం అప్రమత్తమైంది.

Published : 10 Aug 2022 04:52 IST

ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ

ఉండి వద్ద పంట కాలువ నుంచి డ్రెయిన్‌లోకి వదులుతున్న నీరు

ఉండి, న్యూస్‌టుడే: అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని మురుగుకాలువల్లో ప్రవాహం పెరుగుతోంది. యనమదుర్రు డ్రెయిన్‌లోకి ఎర్రకాలువ వరద నీటిని వదలడంతో తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరు, ఉండి, భీమవరం నియోజకవర్గాల పరిధిలో యంత్రాంగం అప్రమత్తమైంది. నందమూరు అక్విడక్టు వద్ద నీటి మట్టం 30.50 అడుగులకు చేరడంతో అధికారులు భీమవరం ప్రాంతంలో కాలువ గట్లను పరిశీలించారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రవాహం కొంతమేర తగ్గి 30.20 అడుగులకు చేరింది. ప్రస్తుతానికి మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.నీ డెల్టాలో బొండాడ, రుద్రాయకోడు, చినకాపవరం, గోస్తనీ తదితర డ్రెయిన్లలో ప్రవాహం పెరుగుతోంది. జిల్లాలోని అన్ని మైనర్‌, మీడియం డ్రెయిన్లలోనూ ఇదే పరిస్థితి. మరికొద్ది రోజలు వర్షాలు కొనసాగితే పల్లపు ప్రాంతాల్లో లేత నాట్లు, వరి చేలు ముంపుబారిన పడే అవకాశాలున్నాయని రైతులు వాపోతున్నారు.

సాగునీరు మళ్లింపు
వర్షాల నేపథ్యంలో డెల్టాలో ఉండి, వెంకయ్య వయ్యేరు, పాత వయ్యేరు, జీఅండ్‌వీ, నరసాపురం, బ్యాంక్‌ కెనాల్‌, కాకరపర్రు, అత్తిలి తదితర ప్రధాన కాలువల్లో సాగునీటిని ఎక్కడికక్కడ సర్‌ఫ్లస్‌ వియర్లు తెరిచి డ్రెయిన్లలోకి మళ్లిస్తున్నారు. ఉండి ప్రధాన పంట కాలువలో నీటిమట్టం 4 అడుగులకు మించకుండా యండగండి, ఉండి, చెరుకువాడ తదితర ప్రాంతాల్లో వియర్ల ద్వారా డ్రెయిన్లలోకి నీటిని వదిలేస్తున్నారు.

ఆక్వాపై ప్రభావం
నిలకడలేని వాతావరణం ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చెరువుల్లో ప్రాణవాయువు లోటు కారణంగా ఆకస్మికంగా రొయ్యల పట్టుబడులు జరుపుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని సాగుదారులు ఆవేదన చెందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని