logo

పాలకొల్లు పూర్వ ఎస్సైకు ఏడేళ్ల జైలు

లంచం కేసులో పూర్వ ఎస్సైకు జైలు శిక్ష విధిస్తూ హైదరాబాద్‌లోని ఏసీబీ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ వివరాలను తెలంగాణ రాష్ట్ర ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

Published : 24 Sep 2022 05:59 IST

లంచం కేసులో ఏసీబీ న్యాయస్థానం తీర్పు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: లంచం కేసులో పూర్వ ఎస్సైకు జైలు శిక్ష విధిస్తూ హైదరాబాద్‌లోని ఏసీబీ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ వివరాలను తెలంగాణ రాష్ట్ర ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. దానిలో వివరాల ప్రకారం.. పాలకొల్లు పోలీస్‌స్టేషన్‌ ఎస్సైగా షేక్‌ మహబూబ్‌ సుభాని పనిచేసిన సమయంలో ఓ మహిళకు సంబంధించిన కేసు విషయంలో స్టేషన్‌ ఉన్నతాధికారి పేరిట లంచం డిమాండ్‌ చేశారు. 2006, ఫిబ్రవరి 3న ఆమె నుంచి రూ.5 లక్షల నగదు తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు అప్పట్లో కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ అనంతరం సంబంధిత ఎస్సైకు పలు సెక్షన్ల కింద ఏడేళ్ల కఠినకారాగార శిక్ష, 6 నెలల సాధారణ శిక్షలను విధించి ఒకేసారి అమలు చేయాలని ఏసీబీ న్యాయం స్థానం తీర్పు ఇచ్చింది. సంబంధిత ఎస్సై గతంలోనే ఉద్యోగ విరమణ పొందినట్లు స్థానిక పోలీసులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని