logo

సామాజిక సేవలను ప్రోత్సహించాలి

స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ సభ్యుడు చెల్లెం ఆనంద్‌ ప్రకాశ్‌ కోరారు.

Published : 25 Jan 2023 05:26 IST

సైకిళ్ల పంపిణీలో ఆనంద్‌ప్రకాశ్‌, అతిథులు

భీమవరం గునుపూడి, న్యూస్‌టుడే: స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ సభ్యుడు చెల్లెం ఆనంద్‌ ప్రకాశ్‌ కోరారు. భీమవరం గునుపూడిలో ఉన్న రాజ్‌ ట్రస్టు కార్యాలయంలో జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సభకు దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర కుమార్‌ అధ్యక్షత వహించారు. రాష్ట్రంలో స్వచ్ఛంద సంస్థలు పలు సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వారందరినీ ప్రభుత్వ గుర్తించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ట్రస్టు ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 135 మంది బాల బాలికలకు సైకిళ్లు పంపిణీ చేశారు. ట్రస్టు అధ్యక్షుడు రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ తమ ట్రస్టు 14 గ్రామాలను దత్తతీసుకుని సేవలు అందిస్తుందన్నారు. రాష్ట్ర గౌడ కార్పొరేషన్‌ సభ్యుడు కామన నాగేశ్వరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి బలరామ్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు న్యూటన్‌, సోమేశ్వరస్వామి ఆలయ ఛైర్‌పర్సన్‌ కోడే విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని