logo

జగన్మాతకు జేజేలు

భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మ జ్యేష్ఠ మాస జాతరలో భాగంగా గురువారం అమ్మవారి ఊరేగింపును నేత్రపర్వంగా నిర్వహించారు.

Updated : 09 Jun 2023 06:35 IST

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మ జ్యేష్ఠ మాస జాతరలో భాగంగా గురువారం అమ్మవారి ఊరేగింపును నేత్రపర్వంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన హంస వాహనంపై అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువుదీర్చి ప్రధానార్చకుడు మద్దిరాల మల్లికార్జునశర్మ పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌, కమిటీ సభ్యులు కొబ్బరికాయ కొట్టి ఊరేగింపు ప్రారంభించారు. పూరిగుడి నుంచి ప్రధాన రహదారుల మీదుగా మేళతాళాలు, బాణసంచా కాల్పులు, ఆసాధులు, విచిత్ర వేషధారణ కళాకారుల నృత్యాల మధ్య అమ్మవారిని ఊరేగించారు. పలు ప్రాంతాల్లో భక్తులు అమ్మవారికి హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటీ, దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించారు. కమిటీ సభ్యులు కూరగాయలు, పండ్ల దుకాణాలకు సెలవు ప్రకటించి ఊరేగింపులో పాల్గొన్నారు.

హంస వాహనంలో కొలువైన మావుళ్లమ్మ ఉత్సవమూర్తి ఊరేగింపు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని