logo

ఎర్రచందనం దుంగలు స్వాధీనం

కడప-తాడిపత్రి ప్రధాన రహదారిలోని ముద్దనూరు మండలం తిమ్మాపురం గ్రామ సమీపంలో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు గురువారం తెలిపారు.

Published : 31 Mar 2023 01:47 IST

కారు, దుంగలతో పాటు నిందితుడిని చూపుతున్న డీఎస్పీ నాగరాజు

ముద్దనూరు, న్యూస్‌టుడే: కడప-తాడిపత్రి ప్రధాన రహదారిలోని ముద్దనూరు మండలం తిమ్మాపురం గ్రామ సమీపంలో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు గురువారం తెలిపారు. ముద్దనూరు ఠాణాలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ ఆదేశాల మేరకు.. సీఐ నరేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో తిమ్మాపురం గ్రామ సచివాలయం వద్ద  వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఓ కారులో 11 ఎర్రచందనం దుంగలను గుర్తించామన్నారు. దుంగలను తరలిస్తున్న కారును, రెండు గొడ్డళ్లను, రెండు పట్టుడు సైజు కలిగిన కంకర రాళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడిన నిందితుల్లో  మైదుకూరు మండలం సోమయాజులపల్లె గ్రామానికి చెందిన నాగార్జునను అదుపులోకి తీసుకోగా, అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన కుమార్‌, హరి తప్పించుకున్నట్లు తెలిపారు. వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు