logo

కడప ఎంపీ స్థానానికి పోటీ చేయాలంటే రూ.40 కోట్ల ఖర్చు

కడప పార్లమెంటుకు పోటీ చేయడానికి రూ.40 కోట్ల వరకు ఖర్చవుతుందని, కాంగ్రెస్‌ పార్టీ మహా అయితే రూ.10 లక్షలు ఇస్తుందని, మిగిలిన డబ్బులు అభ్యర్థి వైఎస్‌ షర్మిల ఎక్కడి నుంచి తెస్తారని వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి రమేశ్‌రెడ్డి ప్రశ్నించారు.

Published : 18 Apr 2024 03:45 IST

కడప నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: కడప పార్లమెంటుకు పోటీ చేయడానికి రూ.40 కోట్ల వరకు ఖర్చవుతుందని, కాంగ్రెస్‌ పార్టీ మహా అయితే రూ.10 లక్షలు ఇస్తుందని, మిగిలిన డబ్బులు అభ్యర్థి వైఎస్‌ షర్మిల ఎక్కడి నుంచి తెస్తారని వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి రమేశ్‌రెడ్డి ప్రశ్నించారు. కడపలోని వైకాపా కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ షర్మిల,  సునీత ఇద్దరూ చంద్రబాబునాయుడికి అమ్ముడుపోయారని, తెదేపా ఐటీ విభాగం నుంచి వచ్చే స్క్రిప్ట్‌నే వారు ప్రచారంలో చదువుతున్నారన్నారు. ఇద్దరూ సైకోలని, వారికి నార్కో అనాలసిస్‌ పరీక్షలు చేయించాలని విమర్శించారు. వివేకా హత్య కేసులో విచారణ పూర్తికాకుండా ఎంపీ అవినాష్‌రెడ్డి, సీఎం జగన్‌లపై ఆరోపణలు చేయడం తగదన్నారు. ఆయనవెంట వైకాపా నాయకుడు డాక్టర్‌ చైతన్యరెడ్డి ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని