logo

సెక్యూరిటీ గార్డే శవపరీక్ష నిపుణుడు

మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఎంత మంది ఎంఎన్‌వోలు, జీడీఏ సిబ్బంది వచ్చినా శవపరీక్షలు మాత్రం భద్రతా సిబ్బందే చేయాల్సి వస్తోంది. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రెడ్డెప్ప గత కొంతకాలంగా శవపరీక్ష విధులు నిర్వహిస్తున్నారు.

Published : 18 Apr 2024 03:50 IST

శవాగారంలోకి అడుగుపెట్టని వైద్యసిబ్బంది

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే : మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఎంత మంది ఎంఎన్‌వోలు, జీడీఏ సిబ్బంది వచ్చినా శవపరీక్షలు మాత్రం భద్రతా సిబ్బందే చేయాల్సి వస్తోంది. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రెడ్డెప్ప గత కొంతకాలంగా శవపరీక్ష విధులు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రిలో ఇటీవల పెద్ద సంఖ్యలో నియామకాలు జరిగాయి. వాటిలో శవపరీక్షకు సహాయకులను కూడా నియమించారు. గతంలో ఓ మహిళను నియమించినా ఆమె ఈ గదివైపు తొంగి చూడడంలేదు. శవపరీక్షలు సెక్యూరిటీ గార్డు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నా పట్టించుకునేవారే కరవయ్యారు. అర్హులున్నా అనర్హులతో ఇలాంటి పనులు చేయిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏమీ చదువుకోని వ్యక్తి శవ పరీక్ష నిర్వహిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బాబు మాట్లాడుతూ శవపరీక్ష కోసం 9 మంది సహాయకుల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల చేశామని, ఒకరు మాత్రమే వచ్చారన్నారు. ఆయన కూడా పోస్టుమార్టం విధులకు రావడం లేదన్నారు. దీంతో గతంలో శవపరీక్షలు నిర్వహించినవారితోనే పనిచేయిస్తున్నామని చెప్పడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని