logo

Crime News: సినిమా టికెట్లకు తండ్రి డబ్బులివ్వలేదని..

సినిమా టికెట్ల కోసం తండ్రి డబ్బు ఇవ్వలేదని మనస్తాపం చెంది.. విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది.

Published : 15 Feb 2022 12:12 IST

జగిత్యాల: సినిమా టికెట్ల కోసం తండ్రి డబ్బు ఇవ్వలేదని మనస్తాపం చెంది.. ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని పురానిపేటలో ఎనిమిదో తరగతి చదువుతున్న పాండులోజి నవదీప్.. సినిమాకు వెళ్లేందుకు తన మిత్రులు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారంటూ.. తండ్రి నర్సయ్యను రూ.300 ఇవ్వాలని అడిగాడు. తన దగ్గర అంత డబ్బు లేదని, కాస్త సమయం ఇవ్వాలంటూ తండ్రి బదులిచ్చాడు. దీంతో మనస్తాపం చెందిన నవదీప్.. ఇంట్లో వేరొక గదిలోకి వెళ్లి ఉరేసుకొని బలవర్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని