logo

Crime News: క్యాబ్‌ ఇంటికి రాలేదని ఫోన్‌చేస్తే.. రూ.54 వేలు స్వాహా

క్యాబ్‌ ఇంటికి రాకపోవడంతో కస్టమర్‌కేర్‌కు ఓ వ్యక్తి ఫోన్‌ చేస్తే.. అతడి బ్యాంక్‌ ఖాతాలోని రూ. 54 వేలను సైబర్‌ నేరగాడు స్వాహా చేసిన సంఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో

Updated : 10 Apr 2022 08:02 IST

వనస్థలిపురం, న్యూస్‌టుడే: క్యాబ్‌ ఇంటికి రాకపోవడంతో కస్టమర్‌కేర్‌కు ఓ వ్యక్తి ఫోన్‌ చేస్తే.. అతడి బ్యాంక్‌ ఖాతాలోని రూ. 54 వేలను సైబర్‌ నేరగాడు స్వాహా చేసిన సంఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక క్రిస్టియన్‌ కాలనీలో ఉంటున్న ఆర్‌.పట్టాభి (67) ఈ నెల 4న రాత్రి ఓ క్యాబ్‌ను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నాడు. గంటసేపైన వాహనం రాకపోవడంతో..సర్వీసును రద్దుచేసుకున్నాడు. దీంతో పట్టాభికి జరిమానా పడింది. దీనిపై ఆ సంస్థ కస్టమర్‌కేర్‌కు ఫిర్యాదు చేయాలని భావించి గూగుల్‌లో శోధించి.. ఓ నంబర్‌కు ఫోన్‌ చేశాడు. తన ఫోన్‌లో ఎనీడెస్క్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటూ అవతలి వ్యక్తి బదులిచ్చాడు. అలాగే చేసి ఓటీపీ తెలిపాడు. కొంతసేపటికి పట్టాభి బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.54 వేలు మాయమయ్యాయి. బాధితుడు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని