logo

పైసలిస్తరు.. బిర్యానీ పెడ్తరు: ఎమ్మెల్యే ఎన్నికలపై ప్రశ్నకు ఓ విద్యార్థి జవాబు

ప్ర: ఎమ్మెల్యే ఎన్నికలు ఎలా జరుగుతాయి..

Updated : 24 Apr 2022 08:39 IST

ప్ర: ఎమ్మెల్యే ఎన్నికలు ఎలా జరుగుతాయి..

జ: ఎమ్మెల్యే కోసం పోటీ పడేటోళ్లు ఇంటికి వస్తరు..పెద్దోళ్లకు పైసలు, బిర్యానీ ఇస్తరు..ఆడోళ్లకు చీరలు ఇస్తరు..అవి తీసుకుని పెద్దోళ్లు ఓట్లు వేస్తరు..ఎవరికి ఓట్లు వస్తే వాళ్లు గెలుస్తరు..

ఫరూక్‌నగర్‌ మండలం లింగారెడ్డిగూడ ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ప్రశ్నపత్రంలో వచ్చిన ప్రశ్నకు ఈ జవాబు ఇవ్వడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఓట్ల కోసం రాజకీయాలు ఎంతగా దిగజారుతున్నాయి.. ఈ ప్రభావం పిల్లలపై ఎలా ఉంటుందనేందుకు ఇది ఉదాహరణ. మరో విశేషం ఏమిటంటే ఈ జవాబుకు ఉపాధ్యాయుడు 4 మార్కులు వేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. మారిన విద్యావిధానం ప్రకారం విద్యార్థుల సృజనాత్మకతకు మార్కులు వేయాల్సిందేనని అన్నారు.

- న్యూస్‌టుడే, షాద్‌నగర్‌ న్యూటౌన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని