logo

క్రీడా స్థలాలను గుర్తించాలి: కలెక్టర్‌

జిల్లాలోని అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల కోసం స్థలాలను మూడు రోజుల్లో గుర్తించి నివేదికను అందజేయాలని పాలనాధికారిణి నిఖిల ఆదేశించారు.

Published : 20 May 2022 03:43 IST


దృశ్యమాధ్యమం ద్వారా మాట్లాడుతున్న కలెక్టర్‌ నిఖిల

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలోని అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల కోసం స్థలాలను మూడు రోజుల్లో గుర్తించి నివేదికను అందజేయాలని పాలనాధికారిణి నిఖిల ఆదేశించారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయం కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి దృశ్యమాధ్యమం ద్వారా తహసీల్దార్లతో మాట్లాడారు. గ్రామీణ యువతకు క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో సమావేశమై వారిచ్చిన నివేదికలను స్థానిక శాసనసభ్యునితో చర్చించి శుక్రవారం లోగా తనకు సమర్పించాలన్నారు. దీని ద్వారా మండలాల వారీగా ఒకే సర్వే నంబరుపై ఎక్కువ మంది రైతుల పేర్లు ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. త్వరలో ధరణిలో 8 కొత్త లాగిన్లు రానున్నాయని చెప్పారు. సమావేశంలో జిల్లా అదనపు పాలనాధికారి మోతీలాల్‌, తాండూరు ఆర్డీవో అశోక్‌కుమార్‌, ఏడీ సర్వే ల్యాండ్‌ రాంరెడ్డి, ఈడీఎం మహమ్మద్‌ పాల్గొన్నారు.

గిరిజన విద్యార్థులకు కార్పొరేట్‌ పాఠశాలలో ప్రవేశాలు: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ ఆదేశాల ప్రకారం జిల్లాలోని ఇంగ్లీషు మీడియం పాఠశాలలో చదువుకుంటున్న గిరిజన విద్యార్థులకు వసతి సౌకర్యంతో పాటు కార్పొరేట్‌ స్థాయి విద్యను అందజేయనున్నారని పాలనాధికారిణి నిఖిల గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హతఉన్న విద్యార్థులు ఈ నెల 23 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ పథకం ద్వారా ఒక్కొ విద్యార్థికి నెలకు రూ. 3 వేల చొప్పున ఉపకార వేతనాన్ని అందజేస్తారని తెలిపారు. మూడు, ఐదు, ఎనిమిది తరగతుల గిరిజన విద్యార్థుల ప్రవేశాలకు ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యం నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఇతర వివరాలకు చరవాణి నంబరు 86393 88553, 99081 20296లో సంప్రదించాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని