icon icon icon
icon icon icon

Chandrababu: ప్రతి ఆడబిడ్డను లక్షాధికారిని చేసే బాధ్యత నాది: చంద్రబాబు

ఆడ పిల్లలకు పుట్టినిల్లు తెలుగుదేశం అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికలు రాగానే మోసగాళ్లు వస్తారు.. రకరకాల మాటలు చెప్తారని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Updated : 23 Apr 2024 15:47 IST

బొండపల్లి: ఆడ పిల్లలకు పుట్టినిల్లు తెలుగుదేశం అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికలు రాగానే మోసగాళ్లు వస్తారు.. రకరకాల మాటలు చెప్తారని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ పరిధిలోని బొండపల్లిలో మహిళలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.

‘‘మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన వ్యక్తి దివంగత నేత ఎన్టీఆర్. కానీ జగన్ మాత్రం ఆయన చెల్లెమ్మకు ఆస్తి కాకుండా అప్పులు ఇచ్చారు. ఆడబిడ్డలు బాగా చదువుకోవాలని మహిళా యూనివర్సిటీలు స్థాపించాం. మహిళలకు రాజకీయంగా అవకాశం కల్పించాం. ఆడ బిడ్డల చదువుకు తెదేపా ఎంతో కృషి చేసింది. వారిని లక్షాధికారిని చేసే బాధ్యత నాది. 

జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముద్దులు పెట్టాడు.. అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు కురిపిస్తున్నాడు. మీకు రూ.పది ఇచ్చి.. రూ.వంద దోచేస్తున్నారు. ఐదేళ్లలో మహిళలపై దాడులు విపరీతంగా పెరిగాయి. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. వైకాపా పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో నష్టపోయింది’’ అని చంద్రబాబు విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img