icon icon icon
icon icon icon

ఏపీ ఎన్నికలు.. మరో 38 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌

ఏపీ ఎన్నికలకు మరో 38 మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించింది.

Updated : 22 Apr 2024 13:09 IST

దిల్లీ: ఏపీ ఎన్నికలకు అసెంబ్లీ అభ్యర్థుల మరో జాబితాను కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించింది. గతంలో 114 స్థానాలకు వెల్లడించగా.. తాజాగా 38 నియోజకవర్గాలకు ఖరారు చేశారు. ఇప్పటికే ప్రకటించిన 10 స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో ఇప్పటి వరకు 142 స్థానాలకు హస్తం పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్లయింది. ఇండియా కూటమి పొత్తులో భాగంగా అరకు లోక్‌సభతో పాటు 8 అసెంబ్లీ సీట్లను సీపీఎంకు కేటాయించారు. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో ఇప్పటి వరకు 20 చోట్ల అభ్యర్థులను కాంగ్రెస్‌ ప్రకటించింది. పొత్తులో ఒకటి సీపీఎంకు వెళ్లిపోవడంతో మరో నాలుగు ఎంపీ, మిగిలిన అసెంబ్లీ స్థానాలకు ఖరారు చేయాల్సి ఉంది.

అభ్యర్థులు వీళ్లే..

  • శ్రీకాకుళం - అంబటి కృష్ణారావు (పాడి నాగభూషణరావు స్థానంలో)
  • బొబ్బిలి- మరిపి విద్యాసాగర్‌
  • గజపతినగరం- దోలా శ్రీనివాస్‌ (కురిమినాయుడు స్థానంలో)
  • నెల్లిమర్ల - ఎస్‌.రమేశ్‌కుమార్‌
  • విశాఖపట్నం ఉత్తరం - లక్కరాజు రామారావు
  • చోడవరం - జగత్‌ శ్రీనివాస్‌
  • యలమంచిలి - టి.నర్సింగ్‌ రావు
  • పి.గన్నవరం (ఎస్సీ) - కె.చిట్టిబాబు
  • ఆచంట - నెక్కంటి వెంకట సత్యనారాయణ
  • విజయవాడ (ఈస్ట్‌) - సుంకర పద్మశ్రీ
  • జగ్గయ్యపేట - కర్నాటి అప్పారావు
  • తాడికొండ (ఎస్సీ) - మణిచల సుశీల్‌ రాజా (చిలకా విజయ్‌ కుమార్‌ స్థానంలో..)
  • రేపల్లె - మోపిదేవి శ్రీనివాసరావు
  • తెనాలి - ఎస్‌కే బషీద్‌
  • గుంటూరు వెస్ట్‌ - డాక్టర్‌. రాచకొండ జాన్‌ బాబు
  • చీరాల - ఆమంచి కృష్ణమోహన్‌
  • ఒంగోలు - తుర్లపాక నాగలక్ష్మీ (బుట్టి రమేశ్‌బాబు స్థానంలో)
  • కనిగిరి - దేవరపల్లి సుబ్బారెడ్డి (కదిరి భవానీ)
  • కావలి - పొదలకూరి కల్యాణ్‌
  • కోవూరు - నారపరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి (నెబ్రంబాకం మోహన్‌ స్థానంలో)
  • సర్వేపల్లి - పి.వి. శ్రీకాంత్‌రెడ్డి (పూల చంద్రశేఖర్‌ స్థానంలో)
  • గూడురు (ఎస్సీ) డాక్టర్‌. యు రామకృష్ణారావు (వేమయ్య చిలుకూరి స్థానంలో)
  • సూళ్లూరుపేట(ఎస్సీ- చందనమూడి శివ (గడి తిలక్‌బాబు స్థానంలో)
  • వెంకటగిరి - పి.శ్రీనివాసులు
  • కడప- తుమ్మన్‌ కల్యాల్‌ అస్జల్‌ అలీఖాన్‌
  • పులివెందుల- మూలంరెడ్డి ధ్రువకుమార్‌ రెడ్డి
  • జమ్మలమడుగు - బ్రహ్మానందరెడ్డి పాముల
  • ప్రొద్దుటూరు - షేక్‌ పూల మహ్మద్‌ నజీర్‌
  • మైదుకూరు- గుండ్లకుంట శ్రీరాములు
  • ఆళ్లగడ్డ- బారగొడ్ల హుస్సేన్‌
  • శ్రీశైలం- అసర్‌ సయ్యద్‌ ఇస్మాయిల్‌
  • బనగానపల్లె - గూటం పుల్లయ్య
  • డోన్‌ - గారపాటి మధులెట్టి స్వామి
  • ఆదోని - గొల్ల రమేశ్‌
  • ఆలూరు - నవీన్‌ కిషోర్‌ ఆరకట్ల
  • కల్యాణ్‌దుర్గం- పి. రాంభూపాల్ రెడ్డి
  • హిందూపురం - మహ్మద్‌ హుస్సేన్‌ ఇనయతుల్లా (వి నాగరాజు స్థానంలో)
  • ధర్మవరం- రంగాన అశ్వర్థ నారాయణ
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img