icon icon icon
icon icon icon

ఏపీలో ఎన్‌డీఏ కూటమి మంచి పరిణామం

ఆంధ్రప్రదేశ్‌లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, తెదేపా అధినేత చంద్రబాబు, భాజపా కలిసి కూటమిగా ఏర్పడటాన్ని సినీనటుడు చిరంజీవి స్వాగతించారు. ‘

Updated : 21 Apr 2024 11:00 IST

రాష్ట్రం అభివృద్థి పథంలో  ముందుకెళ్లాలనేది నా పెద్ద కోరిక
అందుకు మీరంతా నడుం బిగించి.. ఆశీస్సులందించండి
అభిమానులకు చిరంజీవి పిలుపు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, తెదేపా అధినేత చంద్రబాబు, భాజపా కలిసి కూటమిగా ఏర్పడటాన్ని సినీనటుడు చిరంజీవి స్వాగతించారు. ‘ఇది మంచి పరిణామం.. చాలా సంతోషం. చాలా కాలం తర్వాత ఇప్పుడే రాజకీయాలపై మాట్లాడుతున్నా.. దానికి ప్రధాన కారణం తమ్ముడు పవన్‌ కల్యాణ్‌’ అని చిరంజీవి పేర్కొన్నారు.

‘ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలనేది నాకున్న పెద్ద కోరిక.. అందుకు మీరంతా నడుం బిగించండి.. మీరంతా ఇలాంటి వారికి (ఎన్‌డీఏ అభ్యర్థులు సీఎం రమేశ్‌, పంచకర్ల రమేశ్‌ను చూపిస్తూ) ఓటేయండి.. మీ ఆశీస్సులు వారికి ఉన్నాయనే భావాన్ని, నమ్మకాన్ని మాకు కలిగించండి’ అని అభిమానులకు పిలుపునిచ్చారు. అనకాపల్లి నుంచి భాజపా తరఫున లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేశ్‌, పెందుర్తి అసెంబ్లీ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేశ్‌ శనివారం హైదరాబాద్‌లోని చిరంజీవిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారిద్దరిని గెలిపించాలని కోరుతూ వీడియో విడుదల చేశారు. ‘సీఎం రమేశ్‌ నా చిరకాల మిత్రుడు.., పంచకర్ల రమేశ్‌ నా ఆశీస్సులతో రాజకీయంగా అరంగేట్రం చేశారు. ఇద్దరూ నాకు కావాల్సినవారే.. ఇద్దరూ చాలా మంచివారే కాదు. చాలా సమర్థులు.. వారిని గెలిపించండి. నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో దోహదపడతారనే నమ్మకం ఉంది’ అని చిరంజీవి చెప్పారు. ‘నేను ఎప్పటి నుంచో సీఎం రమేశ్‌ గురించి వింటున్నా.. చూస్తున్నా. ఆయనకు కేంద్రంతో ఉన్న సత్‌సంబంధాలు, పరిచయాలు అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయి’ అని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img