icon icon icon
icon icon icon

రోజంతా శిబిరంలోనే జగన్‌.. కొద్దిమంది నేతలతో సమావేశం

బస్సు యాత్ర నుంచి సీఎం జగన్‌ సోమవారం విరామం తీసుకున్నారు. ఆదివారం రాత్రి విశాఖలోని ఎండాడ కూడలిలో యాత్ర ముగించుకుని మధురవాడ ఐటీహిల్స్‌ సమీపంలో బస చేసేందుకు శిబిరానికి చేరుకున్నారు.

Updated : 23 Apr 2024 07:10 IST

విశాఖపట్నం (మధురవాడ), న్యూస్‌టుడే: బస్సు యాత్ర నుంచి సీఎం జగన్‌ సోమవారం విరామం తీసుకున్నారు. ఆదివారం రాత్రి విశాఖలోని ఎండాడ కూడలిలో యాత్ర ముగించుకుని మధురవాడ ఐటీహిల్స్‌ సమీపంలో బస చేసేందుకు శిబిరానికి చేరుకున్నారు. సోమవారం ఉదయం నుంచి శిబిరంలోనే గడిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల వైకాపా సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి, భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జగన్‌ను కలిశారు. మంగళవారం భీమిలి నియోజకవర్గంలో జరగనున్న బస్సుయాత్రపై ఇరువురు చర్చించినట్లు తెలిసింది. ముత్తంశెట్టి బయటకు వెళ్లిపోయాక సుబ్బారెడ్డి మాత్రం 3గంటల పాటు జగన్‌ వద్ద ఉన్నారు. ఇదే సమయంలో ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మి నామినేషన్‌ వేయడానికి వెళ్లేముందు మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబసభ్యులతో జగన్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. రోజంతా శిబిరంలో ఉన్న జగన్‌ కొద్దిమంది నాయకులనే కలిశారు. మంగళవారం సాయంత్రం ఆయన విజయనగరంలోని చెల్లూరు చేరుకుని అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img