icon icon icon
icon icon icon

సమోసా బాషా.. సేవ చేయాలని ఆశ

బస్టాండ్‌, బస్సుల్లో సమోసాలు, మజ్జిగ ప్యాకెట్లు విక్రయిస్తూ జీవనం సాగించే ఓ వ్యక్తి చిత్తూరు జిల్లా పలమనేరు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు.

Updated : 24 Apr 2024 07:15 IST

పలమనేరు, న్యూస్‌టుడే: బస్టాండ్‌, బస్సుల్లో సమోసాలు, మజ్జిగ ప్యాకెట్లు విక్రయిస్తూ జీవనం సాగించే ఓ వ్యక్తి చిత్తూరు జిల్లా పలమనేరు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. పట్టణానికి చెందిన బాషా రోజంతా పనిచేస్తే వచ్చే ఆదాయం రూ.500లోపే. అందులోనే కొంత సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తుంటారు. వేసవిలో సొంత నిధులతో చలివేంద్రం ఏర్పాటు చేస్తారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆశతో సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్‌ దాఖలు చేశారు. ‘నేను నలుగురికి సాయపడతా.. నన్ను గెలిపిస్తే మంచి చేస్తా’ అంటూ ఆయన తన మనసులోని మాట చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img