icon icon icon
icon icon icon

Andhra News: పోస్టల్‌ బ్యాలెట్ల పోలింగ్‌ ప్రక్రియలో తీవ్ర గందరగోళం

పోస్టల్‌ బ్యాలెట్ల పోలింగ్‌ ప్రక్రియలో ఏర్పడిన గందరగోళం, అయోమయ పరిస్థితులు పోలింగ్‌ అధికారులను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

Published : 05 May 2024 16:13 IST

అమరావతి: పోస్టల్‌ బ్యాలెట్ల పోలింగ్‌ ప్రక్రియలో ఏర్పడిన గందరగోళం, అయోమయ పరిస్థితులు పోలింగ్‌ అధికారులను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మే 13న పోలింగ్‌ విధుల్లో పాల్గొనాల్సిన అధికారులు.. తమకే ఓటు లేకుండా చేయడంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇంత గందరగోళ పరిస్థితులు తామెన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలకు చెందిన పోలింగ్‌ విధుల్లో పాల్గొనే పీవో, ఏపీవోలతో పాటు ఓపీవోలుగానూ వేల మందికి పోస్టల్‌ బ్యాలెట్లు కేటాయించినా ఫెసిలిటేషన్‌ సెంటర్ల విషయంలో అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవటం తీవ్ర గందరగోళానికి దారి తీసింది. దీనిపై అధికారులను అడిగినా సరైన సమాచారం ఇవ్వటం లేదని పోస్టల్‌ బ్యాలెట్లు తీసుకున్న ఎన్నికల సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. పోలీసులతో పాటు వివిధ విభాగాలకు చెందిన భద్రతా సిబ్బందికి ఫామ్‌-12 కూడా ఇవ్వకపోవడంతో వారంతా ఓటు హక్కు కోల్పోయారు. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన ఎన్నికల సిబ్బంది తమ ఓటు ఎక్కడంటూ అధికారులను నిలదీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img