icon icon icon
icon icon icon

పొలాల్లో నాటిన హద్దు రాళ్లే.. జగన్‌ ఓటమికి శిలాఫలకాలు

జగనన్న భూరక్ష పేరిట రైతుల పొలాల్లో నాటిన హద్దురాళ్లే జగన్‌ ప్రభుత్వ ఓటమికి శిలాఫలకాలని, ఆ పథకం పెద్ద బోగస్‌ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు.

Updated : 05 May 2024 09:10 IST

‘జగనన్న భూరక్ష’ పథకం బోగస్‌
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: జగనన్న భూరక్ష పేరిట రైతుల పొలాల్లో నాటిన హద్దురాళ్లే జగన్‌ ప్రభుత్వ ఓటమికి శిలాఫలకాలని, ఆ పథకం పెద్ద బోగస్‌ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. భూ హక్కుదారులకు వైకాపా ప్రభుత్వం ఇచ్చిన పాసుపుస్తకాలు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావని ఎద్దేవా చేశారు. నారాయణ ఓ పొలంలో కూర్చుని భూరక్ష పథకంలోని లొసుగుల్ని వివరిస్తోన్న వీడియో సామాజిక మాధ్యమంలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. ‘బ్యాంకు రుణం తీసుకునేటప్పుడు, భూమి రిజిస్ట్రేషన్‌ సమయంలో ఈ భూ యజమాని హక్కు పత్రం/పట్టాదారు పాసు పుస్తకాన్ని అధికారికంగా చూపించనవసరం లేదు.. అని ఈ పాసు పుస్తకంలో రాసి ఉంది. అంటే ఇది దేనికీ పనికిరాని బోగస్‌ పత్రం. ఈ పుస్తకాలపై జగన్‌ బొమ్మలు, పొలాల్లో ఆయన పేరుతో హద్దురాళ్లను నాటడానికే రాష్ట్ర ప్రభుత్వం.. రూ.వేల కోట్లు దుబారా చేసింది. గత ప్రభుత్వాలిచ్చిన పాసు పుస్తకాలపై రాజముద్ర తప్ప ఎవరి ఫొటోలూ లేవు. వాటి ద్వారా యజమానులకు అన్ని రకాల హక్కులూ లభించేవి. తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ ఇలాంటిదే. ఆయన ఓడిపోవడానికి ప్రధాన కారణం అస్తవ్యస్త భూ రికార్డులే. ఏపీలో జగన్‌కూ అదే గతి పడుతుంది’ అని నారాయణ వీడియోలో తేల్చిచెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img