icon icon icon
icon icon icon

పార్టీ మారారని పొట్ట కొట్టిన వైకాపా నాయకులు

వైకాపా నాయకుల ఆగడాలు ఆగడం లేదు. తెదేపా సభలకు వెళ్లారని, ప్రచారంలో పాల్గొన్నారని, తమ పార్టీలో చేరలేదని వైకాపా శ్రేణులు... దాడులకు పాల్పడుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం.

Updated : 05 May 2024 07:02 IST

ఆసుపత్రి మూసి వేయించి కక్ష సాధింపు

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: వైకాపా నాయకుల ఆగడాలు ఆగడం లేదు. తెదేపా సభలకు వెళ్లారని, ప్రచారంలో పాల్గొన్నారని, తమ పార్టీలో చేరలేదని వైకాపా శ్రేణులు... దాడులకు పాల్పడుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా వైకాపాలో చేరలేదని ఓ ప్రైవేటు వైద్యశాల ఎండీపై కక్ష కట్టారు. ఆ ఆసుపత్రిని మూయించివేశారు. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో ఐదేళ్ల నుంచి వైద్య సేవలు అందిస్తున్న ‘వెంకట సన్నీ’ ఆసుపత్రిని వైకాపా నాయకులు రాజకీయ కక్షతో మూయించారని ఆసుపత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ మార్తి వీరబాబు వాపోయారు. సామాజిక మాధ్యమాలకు ఆయన విడుదల చేసిన వీడియో ప్రకారం.. ‘జగ్గయ్యపేట మండలం షేర్‌మహ్మద్‌పేట గ్రామానికి చెందిన నేను జగ్గయ్యపేటలో వెంకట సన్నీ ఆసుపత్రి నెలకొల్పి అధునాతన వైద్య సేవల్ని అతి తక్కువ ధరలకే అందిస్తున్నాను. ఇటీవల నేను తెదేపాలో చేరాను. కూటమి అభ్యర్థి శ్రీరాం తాతయ్యకు మద్దతు తెలిపాను. కక్ష కట్టిన వైకాపా నాయకులు అధికార బలంతో నా ఆసుపత్రిని మూసేయించి, నా పొట్టమీద కొట్టారు. కరోనా సమయంలో మెరుగైన సేవలందించాం. అత్యవసర వైద్యం చేయడంలో మంచి పేరున్న మా ఆసుపత్రిని మూసేయించడం వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారు. నెలకు రూ.10 లక్షల అద్దెలు, సిబ్బంది జీతాలు చెల్లించాల్సిన నేను వీధిన పడే పరిస్థితి వచ్చింది’ అని వాపోయారు. ఆసుపత్రిని మూసివేయించినా నా మద్దతు తెదేపాకే. కూటమి అభ్యర్థి శ్రీరాంతాతయ్య గెలుపు కోసం కృషి చేస్తాను. వైకాపా దాష్టీకాల్ని వ్యతిరేకించే వారంతా నాకు నైతిక మద్దతునివ్వాలి’ అని వీడియోలో కోరారు. ఇన్నాళ్లూ వైకాపాలో ఉన్న ఆయన తెదేపా చేరడంతో జీర్ణించుకోలేక పోయిన మూకలు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img