icon icon icon
icon icon icon

Ganta Srinivasarao: సీఎం రమేశ్‌పై దాడి.. జగన్‌ ఫ్రస్టేషన్‌కు ఉదాహరణ: గంటా శ్రీనివాసరావు

అనకాపల్లి లోక్‌సభ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌పై దాడిని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఖండించారు. 

Published : 05 May 2024 16:40 IST

విశాఖపట్నం: అనకాపల్లి లోక్‌సభ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌పై దాడిని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఖండించారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడి తీరు దొంగే.. దొంగ.. దొంగ అని అరిచినట్లు ఉందని వ్యాఖ్యానించారు. ఓటమి భయంతోనే ముత్యాలనాయుడు, ఆయన అనుచరులు ప్రత్యర్థులపై దాడులకు దిగుతున్నారని విమర్శించారు. ఎంవీపీ కాలనీలోని తన నివాసంలో గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు.

ఈ సంస్కృతి ఉత్తరాంధ్రలో ఎప్పుడూ లేదని, సీఎం జగన్‌ ఫ్రస్టేషన్‌కు ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని గంటా కోరారు. కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోకు ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తోందని, భారీ మెజార్టీతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమన్నారు. జూన్ 9న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేయడం తథ్యమన్నారు. ఉత్తరాంధ్రలోని 34 స్థానాలకు గానూ కూటమి కనీసం 30 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img