icon icon icon
icon icon icon

రాబోయేది ఎన్డీయేనే.. మళ్లీ ప్రధాని మోదీనే: ధర్మవరం సభలో చంద్రబాబు

దేశంలో రాబోయేది ఎన్డీయేనే.. మళ్లీ ప్రధాని అయ్యేది మోదీనే అని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. రాష్ట్రంలో ధర్మాన్ని గెలిపించేందుకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Published : 05 May 2024 14:42 IST

ధర్మవరం: ‘దేశంలో రాబోయేది ఎన్డీయేనే.. మళ్లీ ప్రధాని అయ్యేది మోదీనే’ అని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. రాష్ట్రంలో ధర్మాన్ని గెలిపించేందుకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో కూటమి అభ్యర్థి సత్యకుమార్‌కు మద్దతుగా నిర్వహించిన సభలో కేంద్రమంత్రి అమిత్‌షాతో కలిసి ఆయన పాల్గొన్నారు.

‘‘ ప్రజలు గెలవాలి.. దుర్మార్గుడిని ఇంటికి పంపాలని అమిత్‌షా చెప్పారు. జగన్‌ మూడు రాజధానుల పేరుతో అసలు రాజధానే లేకుండా చేశారు. అమరావతిని నాశనం చేసిన ఆయన్ను ఇంటికి పంపాల్సిందే. అధికారంలోకి వచ్చాక అమరావతిని దేశంలోనే నంబర్‌ వన్‌ రాజధానిగా తీర్చిదిద్ది ప్రపంచపటంలో పెట్టే బాధ్యత ఎన్డీయేది. కేంద్రం, రాష్ట్రం కలిసి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. అమరావతికి కట్టుబడి ఉన్నామని అమిత్‌షా స్పష్టంగా చెప్పారు. పోలవరంపై నిర్దిష్ట హామీ ఇచ్చారు.

మన ఆశలను సైకో జగన్‌ సర్వనాశనం చేశారు. రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు. అమరావతి నిర్మాణానికి కూటమి అభ్యర్థులను గెలిపించారు. పోలవరం పూర్తిచేసి హంద్రీనీవాతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రతి ఎకరాకు నీరందిస్తాం. రాయలసీమ ద్రోహి జగన్‌. ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టూ పూర్తిచేయలేదు. ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.  రాష్ట్రానికి జగన్‌ ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో ఏటా 4లక్షలు చొప్పున 20లక్షల ఉద్యోగాలిస్తాం. ఉద్యోగం వచ్చేవరకు నిరుద్యోగ భృతి ఇస్తాం. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తాం. సమర్థ నాయకత్వం ఉండి కేంద్ర సహకారం తీసుకుంటే అభివృద్ధి సాధ్యమవుతుంది’’అని చంద్రబాబు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img