icon icon icon
icon icon icon

Janasena: సీఎం జగన్‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు

ఏప్రిల్‌ 16న భీమవరంలో సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

Updated : 19 Apr 2024 20:21 IST

అమరావతి: ఏప్రిల్‌ 16న భీమవరంలో సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. సీఎం వ్యాఖ్యలు కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తాయని పేర్కొంది. ‘‘మోడల్‌ కోడ్‌కు విరుద్ధంగా పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిగత జీవితం గురించి జగన్‌ మాట్లాడారు. రాష్ట్రంలో మహిళల్ని కించపరిచేలా రోడ్‌ షోలో ప్రసంగించారు. సానుభూతితో ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు’’ అని జనసేన ప్రధాన కార్యదర్శి టి.శివశంకరరావు.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌మీనాను కలిసి ఫిర్యాదు చేశారు. 

పోలీసుల వైఖరిపై తెదేపా ఫిర్యాదు..

ఎన్నికల్లో పోలీసు అధికారుల పక్షపాత వైఖరిపై తెదేపా మరోమారు సీఈవో మీనాకు ఫిర్యాదు చేసింది. ‘‘మాచర్లలో తెదేపా నేతలపై దాడి జరిగిన సమయంలో సీఐ భక్తవత్సలరెడ్డి అక్కడే ఉన్నారు. ఆయన్ని ఎన్నికల విధుల్లో ఉంచకూడదు. సీఐ లక్ష్మణ్‌ అధికార పార్టీకి సెల్యూట్‌ చేస్తున్నారు. ఇలాంటి అధికారులు విధుల్లో ఉంటే నిష్పాక్షికంగా ఎన్నికలు జరగవు. చిత్తూరులో సీఐ గంగిరెడ్డి .. మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లో పనిచేస్తున్నారు’’ అని సీఈవోకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గులకరాయి సతీశ్‌ను మరో కోడికత్తి శీనుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని తెదేపా నేత వర్ల రామయ్య ఈ సందర్భంగా ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img