icon icon icon
icon icon icon

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి.. ముఖ్యనేతల నామినేషన్లు

తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల సందడి కొనసాగుతోంది. ప్రధాన పార్టీల తరఫున అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారులకు (ఆర్వో) సమర్పించారు.

Updated : 23 Apr 2024 15:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల సందడి కొనసాగుతోంది. ప్రధాన పార్టీల తరఫున అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారులకు (ఆర్వో) సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీల్లో ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో కోలాహలం నెలకొంది.

ఏపీలో పిఠాపురం జనసేన అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌, గుడివాడ అసెంబ్లీ తెదేపా అభ్యర్థిగా వెనిగండ్ల రాము నామినేషన్‌ దాఖలు చేశారు. ధర్మవరం అభ్యర్థిగా సత్యకుమార్‌ (భాజపా), చిలకలూరిపేట నుంచి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు (తెదేపా), నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి (వైకాపా) నామినేషన్ పత్రాలను రిటర్నింగ్‌ అధికారులకు సమర్పించారు. 

తెలంగాణలో పలువురు లోక్‌సభ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. చేవెళ్ల స్థానం నుంచి రంజిత్‌రెడ్డి (కాంగ్రెస్‌), కాసాని జ్ఞానేశ్వర్‌ (భారాస) నామినేషన్‌ పత్రాలను ఆర్వోకు అందజేశారు. నల్గొండ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి, నాగర్‌కర్నూల్‌ నుంచి మల్లు రవి (కాంగ్రెస్‌) నామపత్రాలను సమర్పించారు. ఖమ్మం ఎంపీ స్థానానికి కాంగ్రెస్‌ నేత రఘురాంరెడ్డి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను ఆర్వోకు అందించారు. అయితే ఖమ్మం స్థానంలో అభ్యర్థిని కాంగ్రెస్‌ పార్టీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img