icon icon icon
icon icon icon

Chandrababu: తండ్రి ఆస్తి మొత్తం కొట్టేసి.. చెల్లికి అప్పు ఇచ్చిన వ్యక్తి జగన్‌: చంద్రబాబు

తండ్రి ఆస్తి మొత్తం కొట్టేసి చెల్లికి వాటా ఇవ్వకుండా.. అప్పు ఇచ్చిన దుర్మార్గుడు జగన్‌ అని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు.

Updated : 23 Apr 2024 19:14 IST

పాతపట్నం: తండ్రి ఆస్తి మొత్తం కొట్టేసి చెల్లికి వాటా ఇవ్వకుండా.. అప్పు ఇచ్చిన దుర్మార్గుడు జగన్‌ అని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. జగన్‌ పాలనలో రాష్ట్రం, ప్రజలు నష్టపోయారన్నారు. రైతుల పొలాల్లో సర్వే రాళ్లపైనా జగన్‌ తన ఫొటో వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చుక్కల భూముల్లో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ తెచ్చి భూములు కొల్లగొట్టేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

‘‘ దేశంలో ఎక్కడ చూసినా శ్రీకాకుళం కార్మికులే ఉంటారు. మేం అధికారంలోకి వచ్చాక స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. రాయితీపై వ్యవసాయ యంత్రాలు, పరికరాలు అందిస్తాం. వ్యవసాయంలో ఆధునిక సాగు విధానాలు తెచ్చి.. రైతులకు ఖర్చులు తగ్గిస్తాం. ఐదేళ్లలో మీరు ఊహించని అభివృద్ధి చేసి చూపిస్తాం. పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. ఉద్యోగుల పెండింగ్‌ బకాయిలు ఇస్తాం. డ్వాక్రా సంఘాలకు రూ.10లక్షల వరకు వడ్డీలేని రుణాలిస్తాం. మేం వచ్చాక ఇంటి పన్నులు నియంత్రణ చేస్తాం. పాతపట్నం ప్రజలు కొత్త చరిత్ర రాసేందుకు సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో క్వీన్‌ స్వీప్‌ చేస్తున్నాం’’ అని చంద్రబాబు అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img