ఆ ఛానళ్లపై రాజద్రోహం కేసు పెడతారా?
కొవిడ్ సంబంధిత సమస్యలపై విమర్శనాత్మక కథనాలను ప్రసారం చేసిన టీవీ ఛానెళ్లపై రాజద్రోహం కేసు పెడతారా అంటూ అధికారుల తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది. కొవిడ్ సమస్యలపై విమర్శనాత్మక కథనాల విషయంలో
కొవిడ్ కథనాలపై అధికారుల వైఖరిని నిలదీసిన సర్వోన్నత న్యాయస్థానం
దిల్లీ: కొవిడ్ వల్ల తలెత్తిన సమస్యలపై విమర్శనాత్మక కథనాలను ప్రసారం చేసిన టీవీ ఛానళ్లపై రాజద్రోహం కేసు పెడతారా? అంటూ అధికారుల తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది. విమర్శనాత్మక కథనాల విషయంలో వారి వైఖరిని సోమవారం ప్రశ్నించింది. ‘కొవిడ్‌తో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని నదిలో విసిరేస్తున్న దృశ్యాలను మేము చూశాం. వాటిని ప్రసారం చేసిన టీవీ ఛానల్‌పై రాజద్రోహం కింద కేసు నమోదు చేశారో లేదో నాకు తెలియదు’ అంటూ జస్టిస్ చంద్రచూడ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కొవిడ్‌తో మృతి చెందినవారికి అంతిమ సంస్కారాలు గౌరవప్రదంగా జరగాలంటూ జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ చంద్రచూడ్‌తో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఎదుట సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోరా వాదించారు. ఈ అంశంపై స్పందిస్తూ.. జస్టిస్ చంద్రచూడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మన దేశంలో చాలా శ్మశానవాటికలు ఉన్నా.. వాటిలో ఎక్కువ శాతం వినియోగంలో లేకపోవడం బాధాకరమని మీనాక్షి అరోరా పేర్కొన్నారు.
దీంతో మృతదేహాలకు అంతిమ సంస్కారం గౌరవప్రదంగా జరగడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు వైరస్‌వ్యాప్తితో ప్రజలు ఆందోళనలో ఉంటే.. మరోవైపు కరోనాతో మృతి చెందిన వారికి అంత్యక్రియలు నిర్వహించడం పేదలకు తలకు మించిన భారంగా పరిణమించిందని ఆమె వివరించారు. కొవిడ్ సంబంధిత సమస్యలకు సామాజిక మాధ్యమాల్లో సహాయం కోరినవారిపై కేసులు నమోదు చేయడాన్ని ఇంతకుముందే సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. మహమ్మారి నియంత్రణలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలనూ విమర్శించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో 33 చోట్ల హింసాత్మక ఘటనలు.. డీజీపీకి సిట్ నివేదిక అందజేత!
ఏపీలో ఎన్నికల వేళ 33చోట్ల హింసాత్మక ఘటనలు జరిగినట్లు గుర్తించామని సిట్ తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. -
తెలంగాణ మంత్రివర్గం భేటీ ప్రారంభం.. వీటిపైనే చర్చ!
తెలంగాణ మంత్రివర్గం సమావేశమైంది. ఈసీ అనుమతితో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో మంత్రులు భేటీ అయ్యారు. -
ఎన్నికల్లో హింస.. బదిలీ అయినవారి స్థానంలో కొత్త నియామకాలు
ఎన్నికల హింస ఘటనల్లో బదిలీ అయిన వారి స్థానంలో ఈసీ కొత్త నియామకాలు చేపట్టింది. -
తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈనెల 22వ తేదీ నాటికి ఒక అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
కవిత జ్యుడీషియల్ రిమాండ్ మళ్లీ పొడిగింపు
భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను దిల్లీలోని ప్రత్యేక కోర్టు పొడిగించింది. -
జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ: బత్తిని కుటుంబ సభ్యులు
చేప ప్రసాదం పంపిణీ జూన్ 8 ఉదయం 11 నుంచి జూన్ 9 ఉదయం 11 గంటల వరకు ఉంటుందని బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 pM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తెలంగాణ ఈసెట్ ఫలితాలు వచ్చేశాయ్
Telangana ECET Results: పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ (TG ECET Results) ఫలితాలు విడుదలయ్యాయి. -
ప్రారంభమైన ‘టెట్’ ఎగ్జామ్.. పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రారంభమైంది. అభ్యర్థుల రాకతో వివిధ పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ నెలకొంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో అభిషేకం టికెట్లపై అదనపు బాదుడు.. భక్తుల జేబుకు చిల్లు
శ్రీశైలం దేవస్థానంలో భక్తుల నుంచి అదనంగా టికెట్ రుసుం వసూలు చేస్తున్నారు. అభిషేక కర్తలతోపాటు అదనంగా వచ్చే వారికి టికెట్ రేటు పెంచి విక్రయిస్తున్నారు. -
ఏపీలో ఎన్నికల హింసపై సిట్ నివేదిక సిద్ధం
ఏపీలో ఎన్నికలకు ముందు, తర్వాత హింసపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. ఉదయం 10 గంటలకు డీజీపీకి ప్రత్యేక విచారణ బృందం నివేదిక అందించనుంది. -
బతుకుజీవుడా..
జాతీయ, రాష్ట్రీయ రహదారులపై వాహనాలు వేగంగా దూసుకెళ్తుంటాయి. ప్రధాన మార్గాల్లో రాత్రివేళల్లోనూ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో వేసవిలో రోడ్లపై కొనసాగుతున్న పశు సంచారం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. -
నాణ్యతే ప్రామాణికం.. అవగాహనే కీలకం
రోజువారీ జీవితంలో లెక్కలు, కొలతలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉదయం లేచిన వెంటనే తాగే నీటి నుంచి రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు తీసుకునే ఆహార పదార్థాలు, వినియోగించే పరికరాల నాణ్యతపైనే మన కార్యకలాపాలు ఆధారపడి ఉంటాయి. -
రాములోరికి పసిడి పుష్పార్చన
భద్రాచలం రామాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. కోవెల పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మూలవిరాట్‌కు అర్చకులు సుప్రభాతం పలికి ఆరాధించారు. -
అరచేతిలో వాతావరణ సమాచారం
వాతావరణంలోని మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్‌లను రూపొందించింది. ప్రధానంగా వర్షాకాలంలో వీటి ఉపయోగం ఎక్కువగా ఉండనుంది. -
సింగరేణిలో ఎందుకీ వివక్ష?
ఎన్నికల విధుల్లో పాల్గొంటే ఎంతో కొంత లాభం జరగాలి కదా.. నష్టం ఎందుకు అంటారా.. సింగరేణి క్లరికల్ సిబ్బందికి ఆర్థికంగానే కాకుండా ఇతరత్రా నష్టం వాటిల్లుతోంది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీని మించిన స్ఫూర్తి ఎవరు.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
-
ఏపీలో 33 చోట్ల హింసాత్మక ఘటనలు.. డీజీపీకి సిట్ నివేదిక అందజేత!
-
తెలంగాణ మంత్రివర్గం భేటీ ప్రారంభం.. వీటిపైనే చర్చ!
-
మారణాయుధాలతో హ్యారీ విన్స్టన్లోకి చొరబడి.. రూ.కోట్ల విలువైన ఆభరణాలు చోరీ
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్.. ఏ జట్టు ఎలా వచ్చిందంటే?
-
ఎన్నికల్లో హింస.. బదిలీ అయినవారి స్థానంలో కొత్త నియామకాలు