Harish Rao: ‘మన చెత్త - మన బాధ్యత’.. సిద్దిపేటలో చెత్త ఎత్తిన మంత్రి హరీశ్‌రావు

చెత్త ఏరివేతతో స్వచ్ఛ పట్టణాన్ని సాధించవచ్చంటూ మరో సంస్కరణకు సిద్దిపేట మున్సిపాలిటీ శ్రీకారం చుట్టింది.

Published : 24 Jul 2023 12:47 IST

సిద్దిపేట: చెత్త ఏరివేతతో స్వచ్ఛ పట్టణాన్ని సాధించవచ్చంటూ మరో సంస్కరణకు సిద్దిపేట మున్సిపాలిటీ శ్రీకారం చుట్టింది. ఈమేరకు జిల్లాలో నిర్వహించిన ‘నడకతో ఆరోగ్యం, చెత్త ఏరివేతతో స్వచ్ఛ పట్టణం’ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. వీధుల్లో నడుస్తూ చెత్త ఏరారు. మురుగుకాల్వల్లోని ప్లాస్టిక్‌ వస్తువులను మంత్రి స్వయంగా తొలగించారు. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రతను ప్రజలు పాటించాలని హరీశ్‌ కోరారు. ‘మన చెత్త - మన బాధ్యత’ అంటూ ప్రచారం చేశారు. చెత్త వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు ఆయన అవగాహన కల్పించారు. 

మరోవైపు యోగా చేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటామని, క్రమపద్ధతిలో చేస్తే జీవితకాలం పెరుగుతుందని హరీశ్‌రావు అన్నారు. జిల్లాలోని ఓ పాఠశాలలో నిర్వహించిన ఆనంద యోగా క్యాంప్ కార్యక్రమానికి హాజరై 100 మంది సాధకులకు మ్యాట్లు పంపిణీ చేశారు. పట్టణంలోని వార్డుల వారీగా 10 రోజులు ఉచిత యోగా శిబిరం నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని