Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 17 Mar 2024 09:01 IST

1. నేరచరిత్ర ఉందా.. మీకే టికెట్‌!

వైకాపా ప్రకటించిన అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల్లో నేరచరితులకే పెద్దపీట వేశారు. సీబీఐ, ఈడీ కేసుల్లో ఉన్నవారితోపాటు, హత్య కేసుల్లో నిందితులు, గతంలో హత్యాయత్నం కేసులు నమోదైనవారికీ వైకాపా టికెట్లిచ్చింది. ఎర్రచందనం స్మగ్లర్‌కు కూడా వైకాపా అధ్యక్షుడు జగన్‌ ఛాన్స్‌ ఇచ్చారు. అభ్యర్థుల్లో.. దాడులు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు చేసినవారి సంఖ్య భారీగానే ఉంది. పూర్తి కథనం

2. భారాసది దోపిడీ.. కాంగ్రెస్‌ది లూటీ 

దేశంలో మార్పు కోసం ఒక్కటే గ్యారంటీ ఉందని.. అది మోదీ గ్యారంటీ అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇచ్చిన మాటను తప్పక నెరువేరుస్తామని.. దీన్ని ఇప్పటికే చేసి చూపించామని పేర్కొన్నారు. గత పదేళ్లుగా తెలంగాణను భారాస మహా దోపిడీ చేసిందన్నారు. భారాస నేతలు ఇతర రాష్ట్రాలకు వెళ్లి అత్యంత అవినీతిపరులతో భాగస్వామ్యం పెట్టుకున్నారని ఆరోపించారు. పూర్తి కథనం

3. అది మునిగిపోతున్న ఓడలోని ప్రయాణికుల జాబితా

వైకాపా తరఫున పోటీచేసే అభ్యర్థులను మునిగిపోతున్న ఓడలోని ప్రయాణికులుగా తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అభివర్ణించారు. వారి జాబితానే సీఎం జగన్‌ శనివారం ప్రకటించారని ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములని లోకేశ్‌ కొనియాడారు. శనివారం ఆయన జయంతి సందర్భంగా ఎక్స్‌ వేదికగా నివాళి అర్పించారు. పూర్తి కథనం

4. మంత్రా.. మజాకా

ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ అమ్మవారి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం సుమారు ఏడాది కిందట రూ. 12 కోట్ల వ్యయంతో మహామండపం, అమ్మవారి ప్రధానాలయం నిర్మాణ పనులు చేపట్టారు.  ఈ పనులు పూర్తి కాకుండానే దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శనివారం అట్టహాసంగా ప్రారంభించేశారు. దేవస్థానంలో సుమారు రూ.2 కోట్ల వ్యయతో అమ్మవారి ఆలయాన్ని కృష్ణశిలతో నిర్మిస్తున్నారు. పూర్తి కథనం

5. చిన్నవి చిక్కాయి.. పెద్ద చేప తప్పించుకుంది!

జలమండలిలో తాజాగా జరిగిన అవినీతి నిరోధక శాఖ దాడుల్లో పెద్ద చేప తప్పించుకుందనే చర్చ జరుగుతోంది. శుక్రవారం సీజీఎం రెవెన్యూ విభాగంలో సీనియర్‌ అసిస్టెంట్‌ (ఫైనాన్స్‌) ఎల్‌.రాకేష్‌, మరో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి సందీప్‌ రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడటం తెలిసిందే. తొలుత అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి సందీప్‌ సంబంధిత వ్యక్తి నుంచి డబ్బులు తీసుకొని రాకేష్‌కు అందించారు.పూర్తి కథనం

6. ఇక యుద్ధ‘మే’..

సనసభ ఎన్నికల్లో సాధించిన విజయంతో లోక్‌సభ ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాలు సాధించాలని కాంగ్రెస్‌.. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక చోట్ల గెలుపొందడం ద్వారా గత ఎన్నికల్లో ఓటమి తాత్కాలికమేనని నిరూపించుకోవడానికి భారాస.. సీట్లు, ఓట్లలో ఆధిక్యత సాధించి రాష్ట్రంలో కాంగ్రెస్‌కు తామే ప్రత్యామ్నాయమని నిరూపించుకోవడానికి భాజపా.. రాష్ట్రంలో మూడు పార్టీలూ తీవ్రంగా పోటీపడనున్నాయి.పూర్తి కథనం

7. ఫ్యాన్‌ రెక్కలు విరగడం ఖాయం : బొండా

మరో రెండు నెలల్లో జరిగే ఎన్నికల్లో వైకాపా ఫ్యాన్‌ రెక్కలు విరిగి, ముక్కలవుతుందని తెదేపా, జనసేన, భాజపా కూటమి మధ్య నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం ఆయన మొగల్రాజపురంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో.. రాష్ట్ర ప్రజలకు రాక్షస పాలన నుంచి విముక్తి లభించిందన్నారు. మరో 45 రోజుల్లో పూర్తి స్వేచ్ఛ వస్తుందని పేర్కొన్నారు.పూర్తి కథనం

8. ఓటు నమోదుకు ఏప్రిల్‌ 15 వరకు అవకాశం

తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు మే 13న జరగనుండగా ఏప్రిల్‌ 15 వరకు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈలోగా జాబితాలో ఓటు ఉందో? లేదో? పరిశీలించుకుని.. లేని పక్షంలో నమోదు చేసుకోవాలి. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన వారు లేదా ఇప్పటి వరకు ఓటు నమోదు చేసుకోని వారు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది.పూర్తి కథనం

9. అరాచకాలకే అగ్రతాంబూలం

అరాచకం, అవినీతి, భూదందాలు సాగిస్తూ.. రౌడీయిజం చెలాయిస్తూ.. ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో చాలామందికి మళ్లీ ఈ ఎన్నికల్లో టికెట్లు దక్కాయి. రూ.వేల కోట్ల అవినీతి కేసుల్లో ఛార్జిషీట్‌లు నమోదై.. ప్రస్తుతం బెయిల్‌ తీసుకుని, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న జగన్‌ అధినాయకుడిగా ఉన్న వైకాపాలో అనేక మందికి మళ్లీ పోటీచేసే అవకాశం కల్పించడంలో అవే పెద్ద అర్హతలుగా మారడం విశేషం.పూర్తి కథనం

10. ఏపీ రాజధాని ఎక్కడుందో చెప్పలేని దుస్థితి 

‘పదేళ్లయినా పోలవరం పూర్తికాలేదు. ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఎక్కడంటే చెప్పలేని పరిస్థితి. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దిల్లీలో ఈ ప్రాంత నాయకులు తాకట్టు పెట్టారు..’ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. విశాఖ స్టీల్‌ప్లాంటు త్రిష్ణ గ్రౌండ్స్‌లో శనివారం కాంగ్రెస్‌ నిర్వహించిన ‘న్యాయసాధన సభ’కు రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని