ఓటు నమోదుకు ఏప్రిల్‌ 15 వరకు అవకాశం

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు మే 13న జరగనుండగా ఏప్రిల్‌ 15 వరకు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈలోగా జాబితాలో ఓటు ఉందో? లేదో? పరిశీలించుకుని.. లేని పక్షంలో నమోదు చేసుకోవాలి.

Updated : 17 Mar 2024 09:08 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు మే 13న జరగనుండగా ఏప్రిల్‌ 15 వరకు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈలోగా జాబితాలో ఓటు ఉందో? లేదో? పరిశీలించుకుని.. లేని పక్షంలో నమోదు చేసుకోవాలి. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన వారు లేదా ఇప్పటి వరకు ఓటు నమోదు చేసుకోని వారు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ. ఏటా జనవరి, ఏప్రిల్‌, జులై, అక్టోబరు నెల ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటుకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం ప్రకటించి ఎప్పటికప్పుడు జాబితాలు వెలువరిస్తోంది. తాజాగా జాబితాను ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించింది. అందులో పేరు లేనివారు కొత్తగా నమోదు చేసుకోవాలనుకునే వారు ఫారం-8 దరఖాస్తును ఆన్‌లైన్‌లో కానీ నియోజకవర్గ ఎన్నికల అధికారి, సహాయ ఎన్నికల అధికారి లేదా పోలింగ్‌ కేంద్రం అధికారికి ప్రత్యక్షంగానైనా అందజేయవచ్చు. మార్పుచేర్పులకూ అవకాశం ఉంది.

ఓటు నమోదు చేసుకునేందుకు...

https://nvsp.in, https://ceotelangana.nic.in
https://voters.eci.gov.in/

ఓటు ఉందో.. లేదో.. సరిచూసుకునేందుకు..

https://nvsp.in, https://ceotelangana.nic.in

సెల్‌ఫోన్‌ ద్వారా నమోదు చేసుకోవాలనుకుంటే... Voter Help App (VHA)
ఆండ్రాయిడ్‌ ఫోన్లలో https://play.google.com/store/apps/details?id=com.eci.citizen
ఐవోఎస్‌ ఫోన్లలో https://apps.apple.com/in/app/voter-helpline/id1456535004

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని