Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 10 Apr 2024 13:14 IST

1. జనసేన నాయకుడి బార్‌పై పేర్ని కిట్టు అనుచరుల దాడి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

మచిలీపట్నంలో జనసేన నాయకుడు కొరియర్‌ శ్రీను బార్‌పై వైకాపా నేతలు దాడి చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం రాత్రి పేర్ని కిట్టు ఐదుగురు అనుచరులు అక్కడికి తాగేందుకు వచ్చారు. కౌంటర్‌లో ఉన్న నరహరశెట్టి రాము, దేవరకొండ మధుపై వారు బీరు సీసాలతో దాడి చేశారు. పూర్తి కథనం

2. బోధనా రుసుముల చెల్లింపుల్లో పాత విధానాన్ని తీసుకొస్తాం: నారా లోకేశ్‌

తెదేపా అధికారంలోకి రాగానే బోధనా రుసుముల చెల్లింపుల్లో పాత విధానాన్ని అమలు చేస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు. చినకాకానిలో అపార్టుమెంట్‌ వాసులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక కరెంటు ఛార్జీలు తగ్గిస్తామన్నారు.పూర్తి కథనం

3. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. రాధాకిషన్‌రావు రిమాండ్‌ పొడిగింపు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు(Phone tapping case)లో టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. వారం రోజుల కస్టడీ నేటితో ముగియడంతో పోలీసులు ఆయన్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ నెల 12 వరకు రిమాండ్‌ను పొడిగిస్తున్నట్లు పేర్కొంది. పూర్తి కథనం

4. అరెస్టును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్‌

మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్న మనీలాండరింగ్‌ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సమర్థిస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పును దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేసినట్లు ఆయన తరఫున న్యాయవాది వివేక్‌ జైన్‌ బుధవారం వెల్లడించారు.పూర్తి కథనం

5. భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు నిరసన సెగ

పెద్దపల్లి జిల్లాలో మాజీ మంత్రి, భారాస (BRS) ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు నిరసన సెగ తగిలింది. రామగుండంలోని జీడీకే వన్‌ ఇంక్లైయిన్‌ బొగ్గుగనిలో కొప్పుల ఈశ్వర్‌, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఇతర నేతలు ప్రచారానికి వెళ్లారు. ఈశ్వర్‌ బంధువులను గని లోపలికి దించకుండా పైన విధులు అప్పగించడపై కార్మికుల ఆగ్రహం వ్యక్తం చేశారు.పూర్తి కథనం

6. రష్యా ముందడుగు వేస్తే..చైనాదే బాధ్యత: అమెరికా హెచ్చరిక

ఉక్రెయిన్‌ (Ukraine)తో జరుగుతోన్న యుద్ధంలో రష్యా (Russia) ముందడుగు వేస్తే.. అందుకు చైనా (China)నే బాధ్యత వహించాల్సి ఉంటుందని అమెరికా (USA) హెచ్చరించింది. రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్‌ బీజింగ్‌లో పర్యటించిన నేపథ్యంలో అగ్రదేశం నుంచి ఈ మేరకు స్పందన వచ్చింది.పూర్తి కథనం

7. భవిష్యత్తును చూడాలంటే భారత్‌కు రండి: అమెరికా రాయబారి

మన దేశ అభివృద్ధి ప్రయాణంపై అమెరికా (USA) రాయబారి ఎరిక్‌ గార్సెట్టి (Eric Garcetti) ప్రశంసలు కురిపించారు. ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భారత్‌ (India) కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.పూర్తి కథనం

8. కరోనిల్‌ ప్రచారంపై పతంజలి ఆయుర్వేదను అప్పట్లోనే హెచ్చరించాం: కేంద్రం

అల్లోపతి ఔషధాల ప్రభావశీలతను తక్కువ చేసినందుకుగానూ పతంజలి ఆయుర్వేద (Patanjali Ayurved) సంస్థ తీరును విమర్శిస్తూ కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వశాఖ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. పతంజలి కోర్టు ధిక్కరణ కేసు నేడు విచారణకు రానున్న తరుణంలో ప్రభుత్వం నుంచి ఈ మేరకు స్పందన రావడం గమనార్హం.పూర్తి కథనం

9. నాసిరకంగా బోయింగ్‌ విమానాల నిర్మాణం : ప్రజావేగు ఆరోపణలు

వైమానిక రంగ దిగ్గజం బోయింగ్‌(Boeing)కు చెందిన రెండు ప్రతిష్ఠాత్మక మోడళ్లపై తీవ్రమైన ఆరోపణలు రావడంతో అమెరికా ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మిన్‌స్ట్రేషన్‌ (ఎఫ్‌ఏఏ) రంగంలోకి దిగింది. ఆ కంపెనీకి చెందిన ఇంజినీర్‌ సామ్‌ సలేహ్‌పౌర్‌ బోయింగ్‌(Boeing) లోపాలను ఎత్తిచూపాడు. 777, 787 డ్రీమ్‌లైనర్‌ నిర్మాణ సమయంలో సంస్థ షార్ట్‌కట్లను వాడుతోందని పేర్కొన్నాడు.పూర్తి కథనం

10. సీమర్లను వదిలి.. స్పిన్నర్లను బాది: హిట్టింగ్‌పై నితీశ్‌ రెడ్డి

పంజాబ్‌పై హైదరాబాద్‌ విజయం సాధించడంలో ఓ తెలుగు కుర్రాడు కీలక పాత్ర పోషించాడు. ఆల్‌రౌండర్ నితీశ్‌ కుమార్‌ రెడ్డి బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీ(64) తోపాటు బౌలింగ్‌లో ఒక వికెట్‌ కూడా పడగొట్టాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును దక్కించుకున్నాడు. అతడి వల్లే 39/3 స్కోరుతో ఉన్న హైదరాబాద్‌ చివరికి 182 పరుగులు చేయగలిగింది.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని