Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 15 Apr 2024 13:03 IST

1. జగన్‌పై రాయి దాడి ఘటన.. మా అనుమానాలు బలపడుతున్నాయి: మాజీ మంత్రి ప్రత్తిపాటి

సీఎం జగన్‌పై రాయి దాడి ఘటన వ్యవహారంలో తమ అనుమానాలు బలపడుతున్నాయని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పోలీసుల తీరు అనుమానాలను మరింత పెంచుతోందని చెప్పారు. జగన్‌కు తగిలింది రాయా? ఎయిర్‌ బుల్లెట్టా? అని సందేహం వ్యక్తం చేశారు. పూర్తి కథనం

2. సల్మాన్‌ఖాన్‌ ఇంటి వద్ద పోలీసు వాహనం మిస్సింగ్‌.. కాల్పుల ఘటనలో కీలక విషయం

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) ఇంటి వద్ద కాల్పులు (Firing) తీవ్ర కలకలం సృష్టించాయి. ఆయన నివాసం ఉంటున్న ముంబయి (Mumbai)లోని బాంద్రా ప్రాంతంలో గల గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌ వద్దకు బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.పూర్తి కథనం

3. ఎమ్మెల్సీ కవితకు 9 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ

మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు రౌజ్‌ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆమెకు ఈ నెల 23 వరకు జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది. దీంతో అధికారులు మరోసారి కవితను తిహాడ్‌ జైలుకు తరలించనున్నారు.పూర్తి కథనం

4. ఆ గుర్తుతెలియని వ్యక్తులకు థ్యాంక్స్‌: పాక్‌ డాన్‌ హత్యపై నటుడి పోస్టు

భారత్‌కు చెందిన సరబ్‌జిత్‌ సింగ్‌ (Sarabjit Singh)ను పాకిస్థాన్‌ జైల్లో చంపిన కేసులో నిందితుడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసిన సంగతి తెలిసిందే. దీనిపై భారత్‌కు చెందిన నటుడు రణ్‌దీప్ హుడా (Randeep Hooda) స్పందించారు. ఆ గుర్తుతెలియని వ్యక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎక్స్‌లో పోస్టు పెట్టారుపూర్తి కథనం

5. నౌక స్వాధీనం ఘటన.. ఆ 17 మంది భారతీయ సిబ్బందికి ఇరాన్‌ ఊరట

ఇజ్రాయెల్‌ (Israel)తో ఉద్రిక్తతల వేళ భారత్‌కు వచ్చే ఓ నౌక (Ship)ను ఇరాన్‌ (Iran) స్వాధీనం చేసుకోవడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. అందులోని భారతీయ సిబ్బంది (Indian Crew)కి టెహ్రాన్‌ కాస్త ఊరటనిచ్చింది. మన దేశ అధికారులు వారిని కలిసేందుకు అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని ఇరాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది.పూర్తి కథనం

6. ఆధార్‌ కార్డ్‌లో పుట్టిన తేదీ మార్చుకోవాలా? ఏమేం కావాలి?

నిత్యం వినియోగించే డాక్యుమెంట్లలో ఆధార్‌ కార్డ్‌ (Aadhaar Card) ఒకటి. బ్యాంకుల్లో ఖాతా తెరవాలన్నా, కొత్త సిమ్‌ కార్డు తీసుకోవాలన్నా, రుణం పొందాలన్నా ఈ కార్డ్‌ ఉండాల్సిందే. ముఖ్యంగా అధికారిక గుర్తింపుకార్డుగా దీనికి ఉన్న ప్రాముఖ్యత అంతాఇంతా కాదు. తరచూ వినియోగించే ఆధార్‌కార్డ్‌లో ఏవైనా తప్పులుంటే భవిష్యత్‌లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.పూర్తి కథనం

7. మా యువ వికెట్ కీపర్‌ సిక్స్‌లే కాపాడాయి: రుతురాజ్‌ గైక్వాడ్

ఐపీఎల్ 17వ సీజన్‌లో చెన్నై వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. వాంఖడే మైదానంలో ముంబయిపై 20 పరుగుల తేడాతో గెలిచింది. ఎంఎస్ ధోనీ (MS Dhoni) చివరి ఓవర్‌లో హ్యాట్రిక్‌ సిక్స్‌లు బాదగా.. బౌలింగ్‌లో పతిరన నిప్పులు చెరిగాడు. మ్యాచ్‌ విజయంలో వారిద్దరి పాత్ర కీలకమని చెన్నై కెప్టెన్‌ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) తెలిపాడు.పూర్తి కథనం

8. ఇరాన్‌పై ప్రతిదాడికి సహకరించబోం.. ఇజ్రాయెల్‌కు తేల్చి చెప్పిన అమెరికా!

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ (Iran - Israel) మధ్య ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరుదేశాల మధ్య దాడులు, ప్రతిదాడులతో ఆ ప్రాంతం అట్టుడికింది. ఇరాన్‌ డ్రోన్‌, క్షిపణి దాడులను ఇజ్రాయెల్‌ (Israel) విజయవంతంగా తిప్పికొట్టగలిగింది. పూర్తి కథనం

9. దిగువ నుంచి ఎగువకు ప్రవహిస్తోన్న నీరు.. ఎక్కడో తెలుసా?

నీరు ఎగువ నుంచి దిగువకు ప్రవహించడం చూస్తుంటాం. కానీ ఒక ప్రదేశంలో అందుకు భిన్నంగా దిగువ నుంచి ఎగువకు ప్రవహిస్తోంది. వింటుంటే నమ్మేలా అనిపించడం లేదు కదా.. కానీ మీరు విన్నది నిజమే. ఛత్తీస్‌ఘడ్‌లోని అంబికాపూర్‌ జిల్లా మెయిన్ పట్ సమీపంలో ఓచోట నీరు దిగువ నుంచి ఎగువకు ప్రవహిస్తోంది. ఈ విచిత్రాన్ని చూడటానికి ప్రజలు భారీగా తరలి వస్తున్నారు.పూర్తి కథనం

10. ఏఐ తరంలోనూ ఇదే నెంబర్‌ 1 స్కిల్‌.. జాబ్‌లో చేరబోయేవారికి మిలియనీర్‌ సూచన

కృత్రిమ మేధ (Artificial Intelligence- AI), మెషీన్‌ లెర్నింగ్‌, కోడింగ్‌.. ఇవే ఇప్పుడు జాబ్‌ మార్కెట్‌లో హాట్‌ టాపిక్‌. వీటిలో నైపుణ్యం ఉన్నవారికి మంచి డిమాండ్‌ ఉంది. అయితే వీటి కంటే ముందు ఈ ఏఐ జనరేషన్‌లోనూ మరో స్కిల్‌ చాలా ప్రధానమని చెబుతున్నారు అమెరికాకు చెందిన పారిశ్రామికవేత్త.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని