Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 13 Jun 2023 13:00 IST

1. Viveka Murder Case: వివేకా హత్య గురించి జగన్‌కు ముందే తెలుసు: సునీత

కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ రద్దుపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీతా నర్రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ సందర్భంగా సునీత స్వయంగా వాదనలు వినిపిస్తూ పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సొంత నగరంపై క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా..!

ఉక్రెయిన్‌(Ukrain) అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelensky) సొంత నగరం క్రైవీ రిహ్‌పై రష్యా (Russia) సోమవారం అర్ధరాత్రి క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఓ ఐదంతస్తుల అపార్ట్‌మెంట్‌ భవనం సహా పలు ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుపోయి ఉండొచ్చని ఆ నగర మేయర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన చిత్రాలను డెనిప్రోపెట్రోవ్స్క్‌ గవర్నర్‌ షెర్హీలిసాక్‌ టెలిగ్రామ్‌లో పోస్టు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Team India: అప్పుడు కోహ్లీని కోరలేదు.. రోహిత్‌ బెస్ట్‌ అనిపించాడు: గంగూలీ

గతేడాది జనవరిలో దక్షిణాఫ్రికా చేతిలో భారత్‌ మూడు టెస్టుల సిరీస్‌ను 1-2 తేడాతో ఓడిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పటికే కోహ్లీ టీ20 సారథ్య బాధ్యతలను వదిలేయగా.. వన్డే కెప్టెన్సీకి బీసీసీఐ దూరం చేసింది. దక్షిణాఫ్రికాపై ఓటమితో టెస్టు సారథ్యానికీ విరాట్ కోహ్లీ (Virat Kohli) గుడ్‌బై చెప్పేశాడు. అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీతో విభేదాలు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. KTR: మహిళా సంక్షేమంలో దేశానికే తెలంగాణ ఆదర్శం: కేటీఆర్‌

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మహిళా లోకానికి దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలుపుతూ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Adipurush: అమ్మో.. ఇంత నిడివా!.. ‘పాతాళ భైరవి’ నుంచి ‘ఆదిపురుష్‌’ వరకు..

రామాయణం ఆధారంగా తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush) ఈ శుక్రవారం విడుదల కానుంది. సెన్సార్‌ బోర్డు (Central Board of Film Certification).. యు (U) సర్టిఫికెట్‌ జారీ చేసిన ఈ సినిమా నిడివి 2 గంటల 59 నిమిషాలు. ఈ అప్‌డేట్‌ గురించి తెలియగానే ‘అమ్మో.. ఇంత నిడివా!’ అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నెట్టింట చర్చ సాగించారు. అయితే, ఇంతటి రన్‌టైన్‌ టాలీవుడ్‌కి కొత్తేమీ కాదు. నాటి నుంచి గతేడాది వరకు విడుదలైన పలు సినిమాలు సుమారు 3 గంటలు, అంతకంటే ఎక్కువ నిడివితో విడుదలై, మంచి విజయం అందుకున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. TDP: జగన్‌.. విద్యార్థుల ముందు రాజకీయాలా?: నక్కా ఆనందబాబు

మహానాడులో తెదేపా చేసిన అజెండాతో సీఎం జగన్‌ వెన్నులో వణుకు మొదలైందని ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. అందుకే భయంతో సీఎం భయంతో అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గుంటూరులోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆనందబాబు మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. తల్లిని చంపిన కుమార్తె.. మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి పోలీస్‌స్టేషన్‌కు..

కర్ణాటక (Karnataka)లో అమానుష ఘటన చోటుచేసుకుంది. కన్నతల్లినే చంపేసిన (Murder) ఓ మహిళ.. ఆమె మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లింది. బెంగళూరులోని మికో లేఅవుట్‌ పరిధిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. జాక్‌ డోర్సేవి పచ్చి అబద్ధాలు.. ట్విటర్‌పై ఒత్తిడి ఆరోపణలను ఖండించిన కేంద్రం

సాగు చట్టాల (farmer's protest)పై ఆందోళనలు జరిగిన సమయంలో భారత ప్రభుత్వం నుంచి తమకు ఒత్తిడి ఎదురైందంటూ ట్విటర్‌ మాజీ సీఈఓ జాక్‌ డోర్సే (Jack Dorsey) చేసిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. డోర్సే చెబుతున్న విషయాలు పచ్చి అబద్ధాలని కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ (Rajeev Chandrasekhar) కొట్టిపారేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Cyclone Biparjoy: దూసుకొస్తున్న బిపోర్‌జాయ్‌.. 67 రైళ్లు రద్దు

అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్‌ తుపాను (Cyclone Biparjoy) అతితీవ్ర రూపం ధరించి తీరం వైపు దూసుకొస్తోంది. గురువారం ఇది గుజరాత్‌ (Gujarat)లోని కచ్‌ జిల్లా జఖౌవద్ద తీరాన్ని తాకనుంది. దీంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర యంత్రాంగాలు ముందస్తు సహాయక చర్యలు మొదలుపెట్టాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. White House: భారత్‌తో భాగస్వామ్యం అదుర్స్‌..: శ్వేతసౌధం

భారత్‌-అమెరికా మధ్య వివిధ దశల్లో సానుకూల భాగస్వామ్యాలు ఉన్నాయని శ్వేత సౌధం( White House ) వెల్లడించింది. ముఖ్యంగా రక్షణ రంగంలో చెప్పుకోదగ్గ బంధమే ఉందని.. ఇక ‘క్వాడ్‌’ కూటమిలో ఇరు దేశాల మధ్య అద్భుతమైన సహకారం ఉందని వైట్‌హౌస్‌ స్ట్రాటజిక్‌ కమ్యూనికేషన్స్‌ సమన్వయకర్త జాన్‌ కెర్బీ సోమవారం పేర్కొన్నారు. ప్రధాని మోదీ పర్యటన కోసం తాము ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని