Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 18 Apr 2022 13:10 IST

1. Lakhimpur violence: లఖింపుర్‌ హింసాకాండ.. ఆశిష్‌ మిశ్ర బెయిల్‌ రద్దు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరీ హింస కేసులో నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్ర కుమారుడు ఆశిష్‌ మిశ్రకు సుప్రీంకోర్టు గట్టి షాకిచ్చింది. ఈ కేసులో ఆశిష్‌ మిశ్రకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసింది. అతడు వారం రోజుల్లోగా పోలీసులకు లొంగిపోవాలని ఆదేశించింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. లఖింపుర్‌ ఖేరీ హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆశిష్‌ మిశ్రకు అలహాబాద్‌ హైకోర్టు ఫిబ్రవరి 10న బెయిల్‌ మంజూరు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. భువనేశ్వర్‌లో డ్రైవర్ల నిరసన హోరు.. వేల సంఖ్యలో రాజధానికి

ట్యాక్సీ, ఆటో, లారీ, బస్సు డ్రైవర్ల ఆందోళనలతో ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ హోరెత్తుతోంది. వేల సంఖ్యలో డ్రైవర్లు ఒడిశాలోని అన్ని జిల్లాల నుంచి రాజధానికి తరలివచ్చారు. చాలా కాలంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలంటూ నిరసనకు దిగారు. తమ 11 డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని భువనేశ్వర్‌ విధానసభ వద్ద ఆందోళన చేపట్టారు. అంతకముందు భారీ ర్యాలీ నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఒక్కరోజే 90 శాతం పెరుగుదల.. రెండువేలు దాటిన కేసులు..

దేశంలో కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు మళ్లీ పెరుగుతోన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇన్నిరోజులు వెయ్యికి దగ్గర్లో నమోదైన కొత్త కేసులు.. ఆదివారం రెండు వేల మార్కు దాటేశాయి. మరోవైపు మరణాలు కూడా 200కు పైగా నమోదయ్యాయి. దేశ రాజధాని దిల్లీ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. అక్కడి పరిసర ప్రాంతాల్లో 15 రోజుల్లోనే కొవిడ్ వ్యాప్తి 500 శాతం పెరిగినట్లు ఓ సర్వేలో వెల్లడైంది.  సోమవారం కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Stock Market: ఎరుపెక్కిన మార్కెట్లు.. కారణాలివే!

నాలుగు రోజుల విరామం తర్వాత నేడు తెరుచుకున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఆరంభం నుంచీ తీవ్ర నష్టాల్లో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు సెంటిమెంటును దెబ్బతీశాయి. మధ్యాహ్నం 12:33 గంటల సమయంలో సెన్సెక్స్‌ 1,396 పాయింట్లు దిగజారి 56,912 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 364 పాయింట్లు కుంగి 17,111 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.39 వద్ద పయనిస్తోంది. ముఖ్యంగా ఐటీ షేర్లు భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. ఇన్ఫోసిస్‌ ఏకంగా ఏడు శాతం మేర కుంగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Delhi: దిల్లీ జట్టులో కరోనా కలకలం.. ఆటగాడికి పాజిటివ్‌..!

ప్రస్తుతం జరుగుతోన్న మెగా టీ20 లీగ్‌లో మళ్లీ కొవిడ్‌ భయం నెలకొంది. తాజాగా ఓ దిల్లీ ఆటగాడికి కరోనా పాజిటివ్‌గా తేలిందని సమాచారం. అయితే, అతడి వివరాలు తెలియరాలేదు. దీంతో ఆ జట్టులోని మిగతా ఆటగాళ్లందర్నీ ప్రస్తుతం క్వారంటైన్‌కి తరలించారు. ఈ నేపథ్యంలో ఆ జట్టు.. పంజాబ్‌తో ఆడాల్సిన తదుపరి మ్యాచ్‌పై సందేహాలు నెలకొన్నాయి. కాగా, ఇంతకుముందే దిల్లీ జట్టులో ఒక ఫిజియోకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆటగాళ్లకు యాంటిజెన్‌ పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్‌గా తేలిందని తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Dinesh Karthik: బెంగళూరుకు ధోనీలా తయారవుతోన్న డీకే

6. Save Tax: పిల్లల చదువుపై నెలకు ₹800 పన్ను ప్రయోజనం!

పిల్లల పేరిట పెట్టుబడి పెట్టడం వల్ల రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయి. వారికి ఆర్థిక భరోసానివ్వడంతో పాటు పన్ను ప్రయోజనాలనూ పొందొచ్చు. అందుకే పన్ను మినహాయింపు కోసం పెట్టుబడులు పెట్టేటప్పుడు పిల్లల పేరిట మదుపు చేయడంపైనా దృష్టి సారించాలి. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF), సుకన్య సమృద్ధి యోజన, సంప్రదాయ బీమా పథకాలు, కొన్నిరకాల మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయడం వల్ల పన్ను రాయితీ పొందడమేగాక పిల్లల భవిష్యత్తు కోసం పెద్ద మొత్తంలో డబ్బును పొదుపు చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Bloody Mary review: రివ్యూ: బ్లడీ మేరీ

సినిమా అంటే కేవలం థియేటర్‌ కోసమేనన్న ధోరణిలో మార్పు కనిపిస్తోంది. ఓటీటీ ఫ్లాట్‌ఫాంలు పెరగడం, కరోనాతో థియేటర్లు మూత పడటంతో పలు చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యాయి. పరిస్థితులు చక్కబడినా ఇంకా ఆ ఒరవడి కొనసాగుతోంది. తాజాగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఓటీటీ చిత్రం ‘బ్లడీ మేరీ’. నివేదా పేతురాజు కీలక పాత్రలో నటించిన చిత్రమిది. తాజాగా ఆహా ఓటీటీ వేదికగా విడుదలైంది. మరి సినిమా కథేంటి? ఎలా ఉంది? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మహారాష్ట్రలో పాశవిక ఘటన.. భార్యపై సామూహిక అత్యాచారం చేయించిన భర్త!

మహారాష్ట్రలో పాశవిక ఘటన వెలుగుచూసింది. కుటుంబ కలహాల కారణంగా.. ఓ వ్యక్తి భార్యపై దారుణానికి ఒడిగట్టాడు. ఔసా తాలూకా సారోలా వద్ద తన పొలం యజమాని, అతని సోదరుడిని పిలిపించి.. తన భార్యపై సామూహిక అత్యాచారం చేయించాడు. దిగ్భ్రాంతికర విషయం ఏమిటంటే.. బాధితురాలు తనపై అఘాయిత్యం జరిగిన అనంతరం అర్ధరాత్రి 15 కిలోమీటర్లు నడిచి లాతూర్‌లోని రెండు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేసింది.  నిలంగా ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల మహిళ తన భర్తతో కలిసి సారోలా రోడ్‌ వద్ద వ్యవసాయ క్షేత్రంలో నివాసం ఉంటోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Google Lens: గూగుల్‌ లెన్స్‌లో కొత్తగా మరో మూడు పవర్‌ఫుల్‌ శక్తులు!

టెక్‌ దిగ్గజం గూగుల్‌ రూపొందించిన ఇమేజ్‌ రికగ్‌నైజేషన్‌ టెక్నాలజీ గూగుల్‌ లెన్స్ కొత్త శక్తులతో యూజర్ల ముందుకు వస్తోంది. గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో మరింత సులభంగా, వేగంగా పనులు పూర్తి చేయడానికి మూడు కొత్త ఆప్షన్లను తీసుకురానుంది. ఇమేజ్‌ మీద టెక్ట్స్‌ను కాపీ చేయడానికి ‘కాపీ’, ఇతర భాషల్లోకి తర్జుమా చేయడానికి ‘ట్రాన్స్‌లేట్‌’, ‘ఫైండ్‌ ఇమేజ్‌ సోర్స్‌’ వంటి ఆప్షన్స్‌ను పరిచయం చేయనుంది. అయితే, వీటిని ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. బంజారాహిల్స్‌ పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న నిందితులు

నగరంలోని బంజారాహిల్స్‌లో విలువైన స్థలం కబ్జా కేసుకు సంబంధించి పోలీసుల కస్టడీలో ఉన్న ఇద్దరు నిందితులు తప్పించుకున్నారు. పోలీసులు కళ్లుగప్పి కస్టడీ నుంచి ఏ3 సుభాష్‌ పులిశెట్టి, ఏ4 మిధున్‌ అల్లుల పరారయ్యారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో ఏ2గా విశ్వప్రసాద్‌(టీజీ వెంకటేశ్‌ సోదరుడి కుమారుడు), ఏ5గా ఏపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ ఉన్నారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితులకు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని