Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. దిల్లీ మద్యం కుంభకోణం కేసు.. సిసోదియా సన్నిహితుడి అరెస్ట్
దేశ రాజధాని దిల్లీలోని మద్యం కుంభకోణం వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముమ్మర దర్యాప్తు సాగిస్తోంది. ఈ కేసులో దిల్లీకి చెందిన మద్యం వ్యాపారి అమిత్ అరోఢాను ఈడీ తాజాగా అరెస్టు చేసింది. దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సన్నిహితుడైన అమిత్.. గురుగ్రామ్‌లోని బుడ్డీ రిటైల్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీకి డైరెక్టర్‌గా ఉన్నారు. మనీలాండరింగ్ ఆరోపణలతో గత రాత్రి అమిత్‌ను అరెస్టు చేసినట్లు ఈడీ వర్గాలు బుధవారం వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
తెదేపా మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి సంస్థకు చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది. ఈ మేరకు ఈడీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డికి చెందిన సంస్థల బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లలో అవకతవకలు జరిగినట్లు ఈడీ పేర్కొంది. దివాకర్ రోడ్‌లైన్స్, ఝటధార ఇండస్ట్రీస్ ఆస్తులు, సి.గోపాల్ రెడ్డి అండ్‌కోకు సంబంధించిన కంపెనీ ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపింది. జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడైన కాంట్రాక్టర్ గోపాల్‌రెడ్డి కంపెనీ ఆస్తులను సైతం అటాచ్ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. శ్రద్ధాను చంపినందుకు నేనేం బాధపడట్లేదు.. పాలిగ్రాఫ్ టెస్టులో ఆఫ్తాబ్..!
సంచలనం సృష్టించిన కాల్ సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్ ఆమిన్ పూనావాలాకు ఇటీవల పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. కాగా.. ఈ టెస్టులో ఆఫ్తాబ్ తన నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. పాలిగ్రాఫ్ టెస్టు సమయంలో శ్రద్ధాను తానే హత్య చేశానని అంగీకరించిన ఆఫ్తాబ్.. అందుకు తనకేమీ పశ్చాత్తాపం లేదని, బాధ పడటం లేదని చెప్పినట్లు దర్యాప్తు బృందం వర్గాలు వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ఈడీ విచారణకు హాజరైన నటుడు విజయ్ దేవరకొండ
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు సినీనటుడు విజయ్ దేవరకొండ హాజరయ్యారు. కొద్దినెలల క్రితం ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన ‘లైగర్’ సినిమా లావాదేవీల విషయంలో ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఈడీ విచారణకు ఆ చిత్ర దర్శకుడు పూరీజగన్నాథ్, ఛార్మి హాజరవగా.. ఇప్పుడు విజయ్‌ను విచారిస్తున్నారు. లైగర్ సినిమాకు సంబంధించిన వ్యవహారంలో దుబాయికి డబ్బులు పంపించి అక్కడి నుంచి తిరిగి సినిమాలో పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ అధికారులు గతంలో ప్రాథమికంగా గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ఒక్క వికెట్ దక్కింది.. వర్షం వచ్చేసింది.. కివీస్ స్కోరు 104/1 (18 ఓవర్లు)
టీమ్‌ఇండియాకు ఒక్క వికెట్ దక్కింది. హాఫ్ సెంచరీ చేసిన ఫిన్ అలెన్ (57) ఉమ్రాన్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ చేతికి క్యాచ్ ఇచ్చాడు. దీంతో 16.3 ఓవర్లలో 97 పరుగుల వద్ద కివీస్ తొలి వికెట్‌ను నష్టపోయింది. అనంతరం క్రీజ్‌లోకి కేన్ విలియమ్సన్ వచ్చాడు. అయితే మరో ఓపెనర్ డేవన్ కాన్వే (38*) మాత్రం దూకుడు పెంచాడు. అయితే మ్యాచ్ 18 ఓవర్లు పూర్తయిన తర్వాత వర్షం రావడంతో ఆటను నిలిపి వేశారు. ప్రస్తుతం కివీస్ స్కోరు 104/1. ఇంకో 116 పరుగులు చేస్తే కివీస్ విజయం సాధిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. రష్మికను బ్యాన్ చేస్తే ఆ పరిశ్రమకే నష్టం: దర్శకుడి కామెంట్స్ వైరల్
కన్నడలో రష్మికపై బ్యాన్ విధిస్తే.. ఆ పరిశ్రమకే నష్టమని దర్శకుడు నాగశేఖర్ (Nagashekar) అన్నారు. తన తదుపరి చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన రష్మిక వివాదంపై స్పందించారు. ‘‘ఒకరి నుంచి కృతజ్ఞత కోరుకోవడం మనదే తప్పు. ‘సంజు వెడ్స్ గీత’ చిత్రాన్ని నేను తెరకెక్కించినప్పుడు అందులో కొంతమంది నటీనటులకు అవకాశం ఇచ్చాను. ఇప్పుడు వాళ్లు కెరీర్‌లో పెద్ద స్టార్స్ అయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ఎప్పుడు ముందుండి నడిపించాలో తెలిసిన కెప్టెన్..!
కెప్టెన్‌గా ఎప్పుడు ముందుండి జట్టును నడిపించాలో ప్రపంచానికి చూపించాడు ఫ్రాన్స్ ఆటగాడు జినెడిన్ జిదానే. 1998 ప్రపంచకప్ టోర్నీకి ఫ్రాన్స్ ఆతిథ్యం ఇచ్చింది. అప్పటికే ఈ టోర్నీలకు ఆతిథ్యమిచ్చిన ఉరుగ్వే, ఇటలీ, ఇంగ్లాండ్, వెస్ట్ జర్మనీ, అర్జెంటీనా జట్లు సొంతగడ్డపై ఛాంపియన్లుగా అవతరించాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా కప్‌ను ఒడిసిపట్టాలని ఫ్రాన్స్ ఆటగాళ్లు నిర్ణయించుకొన్నారు. లీగ్ దశ నుంచి ఫైనల్స్ వరకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓటమి అనేదే లేకుండా ముందుకు సాగారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. వైట్‌బాల్ క్రికెట్‌లో నా గణాంకాలు మరీ చెత్తగా ఏమీ లేవు: పంత్
బయట నుంచి వస్తున్న విమర్శలంత దారుణంగా తన వైట్‌బాల్ (వన్డేలు, టీ20లు) క్రికెట్ గణాంకాలు లేవని టీమ్ఇండియా యువ బ్యాటర్ రిషభ్ పంత్ స్పష్టం చేశాడు. టెస్టుల్లో రాణిస్తూ.. వన్డేలు, టీ20ల్లో విఫలం కావడంపై మాజీల నుంచి విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కివీస్ పర్యటనలో ఉన్న రిషభ్ పంత్.. ఆ వ్యాఖ్యలపై స్పందించాడు. అలాగే టీ20 ఫార్మాట్‌లో ఓపెనింగ్ చేయడంపై ఆసక్తి చూపిస్తానని, వన్డేల్లో మాత్రం నాలుగు లేదా ఐదో స్థానంలో ఆడేందుకు ఇష్టపడతానని వెల్లడించాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. మంత్రి గంగుల, ఎంపీ రవిచంద్రకు CBI నోటీసులు
దిల్లీ: తెరాస నేతలకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, తెరాస రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు నోటీసులు జారీ చేసి, రేపు విచారణకు హాజరుకావాలని కోరింది. తెలంగాణలో సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిన నేపథ్యంలో దిల్లీలో జరిగే విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని తెలిపింది. గ్రానైట్ వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాలపై గంగుల కమలాకర్, రవిచంద్రను సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. క్రోమ్‌లో బగ్ ఫిక్స్.. మడత ఫోన్ల కోసం డ్రాగ్ అండ్ డ్రాప్!
వర్క్‌స్పేస్‌లోని యాప్స్‌ను గూగుల్ అప్‌డేట్ చేసింది. జీమెయిల్ సహా ఇతర యాప్‌లలో కొత్తగా మార్పులు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్లు ప్రపంచవ్యాప్తంగా అన్ని రీజియన్లలోని యూజర్లకు అందుబాటులోకి వచ్చినట్లు వెల్లడించింది. మరో రెండు వారాల్లో పూర్తిస్థాయిలో వర్క్‌స్పేస్ సబ్‌స్క్రైబర్లకు పరిచయం కానున్నట్లు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29/01/2023)
-
Sports News
ABD: అంతర్జాతీయంగా ఉన్న సమస్య అదే.. షెడ్యూలింగ్‌పై దృష్టి పెట్టాలి: ఏబీడీ
-
Movies News
Pathaan: రోజుకు రూ. వంద కోట్లు.. ‘పఠాన్’ ఖాతాలో మరో రికార్డు
-
India News
Child Marriage: మైనర్ బాలికతో వివాహం.. యావజ్జీవ కారాగార శిక్షే..!
-
Sports News
Gill - Pant: భవిష్యత్తులో కెప్టెన్సీకి వారిద్దరూ అర్హులు: ఆకాశ్ చోప్రా
-
Movies News
Social Look: అనుపమ స్పెషల్ పోస్ట్.. కశ్మీర్లో సిమ్రత్‌కౌర్