Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. ఒక్క తెలంగాణలోనే పెట్టుబడికి రూ.10 వేలు.. పంట నష్టపోతే రూ.10 వేలు : కేటీఆర్
భారాస అంటేనే.. ‘భారతీయ రైతు సమితి’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఇటీవల వడగళ్ల వానలతో పంట నష్టపోయిన రైతులకు సహాయ పునరావాస చర్యల కింద సత్వరమే ఎకరాకు రూ. పదివేల ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. ‘ఇళ్లల్లోకి వచ్చి ఇలా కొడుతుంటారండి’.. వీడియో షేర్ చేసిన మనోజ్
మంచు సోదరులకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇళ్లల్లోకి వచ్చి ఇలా దాడికి దిగుతుంటారంటూ నటుడు మనోజ్ (Manchu Manoj) షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. ‘‘ఇళ్లల్లోకి వచ్చి మా వాళ్లను బంధువులను ఇలా కొడుతుంటారండి. ఇది ఇక్కడి పరిస్థితి’’ అంటూ మనోజ్ చెబుతుండగా.. మంచు విష్ణు (Manchu vishnu) ఆగ్రహంగా ఉన్నట్లు కనిపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. జాక్‌డోర్సే సంపదలో రూ.4,327 కోట్లు ఆవిరి!
అమెరికాకు చెందిన ఆర్థిక సేవలు, మొబైల్ బ్యాంకింగ్ సంస్థ ‘బ్లాక్’పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే సంపద భారీగా తగ్గింది. హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడిన వెంటనే బ్లాక్ షేర్లు భారీ ఎత్తున పతనమయ్యాయి. దీంతో డోర్సే సంపదలో 526 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.4,327 కోట్లు) ఆవిరయ్యాయి. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ఆయన సంపద 11 శాతం తగ్గి 4.4 బిలియన్ డాలర్లకు చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. అమృత్‌పాల్ ఉత్తరాఖండ్‌లో ఉన్నాడా..? నేపాల్ సరిహద్దుల్లో పోస్టర్లు..
పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) దేశం దాటేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 20న హరియాణాలో ఉన్న అతడు.. ప్రస్తుతం ఉత్తరాఖండ్ చేరుకున్నట్లు సమాచారం. అక్కడి నుంచి నేపాల్ (Nepal) మీదుగా కెనడా వెళ్లేందుకు అతడు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో భారత్-నేపాల్ సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులను అప్రమత్తం చేశారు. అతడి పోస్టర్లను అంటించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. నెల్లూరు టు మంగళగిరి.. కార్లతో గిరిధర్‌రెడ్డి భారీ ర్యాలీ
వైకాపా తిరుగుబాటు నేత, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరుడు గిరిధర్‌రెడ్డి నేడు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో మధ్యాహ్నం ఆయన ఆ పార్టీలో చేరతారు. ఈ సందర్భంగా నెల్లూరు నుంచి గిరిధర్‌రెడ్డి భారీ ర్యాలీగా మంగళగిరికి బయల్దేరారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. వైకాపాకు ఆ అత్యాశే కొంప ముంచిందా?
శాసనసభలో పూర్తిస్థాయి బలం ఉంది.. అలాగే శాసనమండలి కూడా పూర్తిగా తమ నియంత్రణలోనే ఉండాలి, అన్ని ఎమ్మెల్సీ స్థానాలనూ సొంతం చేసుకోవాలనే ప్రభుత్వ పెద్దల అత్యాశే ఈ పరాభవాలకు నాంది పలికిందా అంటే అవుననే అంటున్నాయి వైకాపా వర్గాలు. ‘ఈ నియంతృత్వ పోకడతోనే గతంలో ఎప్పుడూ పోటీచేయని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేరుగా బరిలోకి దిగి బొక్కబోర్లా పడ్డాం’ అని వైకాపా ఎమ్మెల్యేలే వ్యాఖ్యానిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ కేసులో 19 మందిని సాక్షులుగా చేర్చిన సిట్..
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ కేసులో 19 మందిని పోలీసులు సాక్షులుగా చేర్చారు. అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ, కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకరలక్ష్మి, ప్రవీణ్, రాజశేఖర్ వద్ద పనిచేసిన జూనియర్ అసిస్టెంట్‌లను సిట్ సాక్షులుగా చేర్చింది. సాక్షుల జాబితాలో చేర్చిన వారిలో కర్మన్‌ఘాట్‌లోని ఆర్ స్క్వేర్ హోటల్ యజమాని, సిబ్బంది కూడా ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. మస్క్ X టెడ్రోస్.. ట్విటర్ వార్..!
ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అధినేత, ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్(Elon Musk) మధ్య ట్వీట్ల వార్ జరిగింది. భవిష్యత్తు మహమ్మారులను నిరోధించడం, వాటి విషయంలో వేగంగా స్పందించే ఉద్దేశంతో కొత్త ఒప్పందం దిశగా దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మస్క్ చేసిన ట్వీట్ టెడ్రోస్ అధనామ్(Tedros Adhanom) ఆగ్రహానికి దారితీసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై.. సుప్రీంకు 14 విపక్ష పార్టీలు
రాజకీయ కుట్రలో భాగంగా సీబీఐ (CBI), ఈడీ (ED) వంటి సంస్థలను మోదీ సర్కారు దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తున్న విపక్షాలు (opposition parties) తాజాగా ఈ విషయంపై మూకుమ్మడిగా సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. ప్రతిపక్షాలపై కేంద్ర దర్యాప్తు ఏజెన్సీల (central probe agencies) వివక్షపూరిత వినియోగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలో 14 రాజకీయ పార్టీలు శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. సంజూను జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదు?: శశిథరూర్
సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) కూడా సూర్యకుమార్ పేలవమైన ఆటతీరు పై స్పందించారు. సూర్యకుమార్ పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూనే వచ్చిన తక్కువ అవకాశాలను సద్వినియోగం చేసుకుని జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న సంజూ శాంసన్ (Sanju Samson)కు మద్దతుగా నిలిచారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Sunil Gavaskar: ధోనీ కోసం సీఎస్కే టైటిల్ గెలవాలని నా హృదయం కోరుకుంటోంది: గావస్కర్
-
India News
Heavy Rains: ముంచెత్తిన అకాల వర్షం.. 13 మంది మృతి!
-
Crime News
Crime News: కార్ ట్రావెల్స్ పెట్టాలన్న కోరికే డ్రైవర్ కొంపముంచింది
-
Sports News
IPL Final- Dhoni: చెన్నై, గుజరాత్ మధ్య ఫైనల్.. ఐపీఎల్లో చరిత్ర సృష్టించనున్న ధోనీ
-
Movies News
Abhiram: భయంతో నిద్ర పట్టడం లేదు.. తేజ అందరి ముందు తిట్టారు: అభిరామ్
-
India News
PM Modi: ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. ఆర్టీఐ కార్యకర్త అరెస్టు