manchu manoj: ‘ఇళ్లల్లోకి వచ్చి ఇలా కొడుతుంటారండి’.. వీడియో షేర్ చేసిన మనోజ్

నటుడు మంచు మనోజ్‌ (Manchu Manoj) తాజాగా షేర్‌ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో విష్ణు (Vishnu) ఎవరిపైనో ఆగ్రహంగా ఉన్నట్లు కనిపించారు. 

Updated : 24 Mar 2023 12:15 IST

హైదరాబాద్‌: మంచు సోదరులకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇళ్లల్లోకి వచ్చి ఇలా దాడికి దిగుతుంటారంటూ నటుడు మనోజ్‌ (Manchu Manoj) షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. ‘‘ఇళ్లల్లోకి వచ్చి మా వాళ్లను బంధువులను ఇలా కొడుతుంటారండి. ఇది ఇక్కడి పరిస్థితి’’ అంటూ మనోజ్‌ చెబుతుండగా.. మంచు విష్ణు (Manchu vishnu) ఆగ్రహంగా ఉన్నట్లు కనిపించారు.

‘‘వాడు ఏదో అన్నాడు కదా ఒరేయ్‌ గిరేయ్‌ అని’’ అంటూ విష్ణు ఎవరిపైనో కేకలు వేస్తుండగా అక్కడే ఉన్న ఇద్దరి వ్యక్తులు ఆయన్ని ఆపే ప్రయత్నం చేశారు. అయితే.. విష్టు ఎవరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. అలాగే ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే విషయాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ వీడియోను మంచు మనోజ్‌ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్‌ చేసిన కాసేపటికే డిలీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని