Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 07 Mar 2024 09:00 IST

1. ఎన్ని‘కలలు’.. సుడిగాలి పర్యటనలు

లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ శ్రేణులను సమాయత్తం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నగరంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల పేరుతో నాలుగు రోజుల పాటు సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగానే భారీ సభలను ఏర్పాటు చేస్తున్నారు. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ తన హవా కొనసాగించినా.. గ్రేటర్‌ హైదరాబాద్‌లో మాత్రం ఘోరంగా దెబ్బతింది. పూర్తి కథనం

2. పది, ఇంటర్‌, డిగ్రీలతో.. 2049 ఖాళీల భర్తీ

కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలు, విభాగాల్లో 2049 ఖాళీల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ‘సెలక్షన్‌ పోస్టులు ఫేజ్‌-XII/2024’ ప్రకటన వెలువడింది. పరీక్షతో నియామకాలుంటాయి. కొన్ని పోస్టులకు అదనంగా స్కిల్‌ టెస్టు రాయాలి. పది, ఇంటర్‌, డిగ్రీ విద్యార్హతలతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు!  పది, ఇంటర్‌, డిగ్రీ, ఫార్మసీ, నర్సింగ్‌, టైపింగ్‌, స్టెనో... ఇలా భిన్న విద్యార్హతలు, నైపుణ్యాలు ఉన్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి కథనం

3. కన్నేస్తే కొట్టేస్తాం.. కనిపిస్తే కట్టేస్తాం!

గత ఐదేళ్లుగా ప్రజలకు అవసరమైన రహదారులు, భవనాల నిర్మాణాల కంటే.. వైకాపా కార్యాలయాలు, నేతల సొంత అవసరాల కోసం ఉపయోగపడే వాటిపైనే పాలకులు అధిక శ్రద్ధ పెట్టారు. గుంతలదారులతో ఇబ్బంది పడుతున్నామని.. ప్రజలు గగ్గోలు పెడుతున్నా.. స్పందించేవాళ్లు లేరు. అదే.. ఆ ప్రాంతంలో ఓ వైకాపా కార్యాలయం ప్రారంభిస్తే చాలు.. రాత్రికి రాత్రి రోడ్లు వేసేస్తున్నారు. పూర్తి కథనం

4. మహా జాతరకు సర్వం సిద్ధం

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ పుణ్యక్షేత్రంలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. రాజన్న ఆలయం, పరిసరాలు, వేములవాడ పట్టణం స్వాగత తోరణాలు, విద్యుత్తు దీపాల అలంకరణతో మహా జాతర శోభను సంతరించుకున్నాయి. జాతరకు వచ్చే భక్తులకు రూ.2.95 కోట్లతో ఏర్పాట్లు చేశారు. పూర్తి కథనం

5. ‘డబ్బా’కొట్టిన వంతెన ఇంతేనా!!

ఆర్‌కే బీచ్‌లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్‌ బ్రిడ్జిని వైకాపా ప్రభుత్వ మంత్రులు, నేతలు దాదాపు 10 రోజుల క్రితం ప్రారంభించినా ఇప్పటికీ వినియోగంలోకి రాలేదు. పర్యాటకులను ఆకట్టుకునే ప్రాజెక్ట్‌ ఇదే అనేలా నాడు ఎంతో హడావుడి చేశారు. తేలియాడే వంతెన డబ్బాలు అలల తాకిడికి ధ్వంసమవుతున్నాయి. ఎగసిపడుతున్న అలలకు లింకులు తెగిపోతున్నాయి. పూర్తి కథనం

6. కొత్త కోడళ్లకు దారేది..!

మిర్యాలగూడ మండలానికి చెందిన ఓ యువతి రెండేళ్ల కిందట దేవరకొండ ప్రాంతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. కొత్తగా తన పేరిట రేషన్‌కార్డు రావాలంటే తల్లిదండ్రుల రేషన్‌ కార్డులో ఉన్న పేరును తొలగించుకొని అత్తారింటి వద్ద దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దీంతో అప్పుడే పుట్టింటి కార్డులో పేరు తొలగించుకుంది. పూర్తి కథనం

7. విశాఖలో వైకాపాకు స్థానం లేదు: గంటా

జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ అభివృద్ధి గురించి ఎన్నిమాటలు చెప్పినా నమ్మే పరిస్థితిలో ఇక్కడి ప్రజలు లేరని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజన్‌ విశాఖ అంటూ జగన్‌ 28 పేజీల డాక్యుమెంట్‌ను విడుదల చేశారని.. దీనిని ఎప్పుడు విడుదల చేయాలో కూడా కనీస అవగాహన ఆయనకు లేదన్నారు. పూర్తి కథనం

8. బ్యాంకుల్లో ఇంటి దొంగలు

బ్యాంకులో పని చేస్తున్న సిబ్బంది కొంతమంది చేతివాటం ప్రదర్శించి రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. వ్యవసనాలకు బానిసలైన కొందరు బంగారం తాకట్టు పేరుతో రూ.కోట్ల రుణాల గోల్‌మాల్‌కు పాల్పడుతున్న సంఘటనలు బాపట్లలో తరచుగా జరుగుతున్నాయి. మూడేళ్ల క్రితం బ్యాంకు ఆఫ్‌ బరోడాలో ఖాతాదారుల బంగారాన్ని ఉద్యోగి పేరలి సుమంత్‌ మాయం చేసి ప్రైవేటు తనఖా సంస్థల్లో రూ.2.50 కోట్లకు తాకట్టు పెట్టి భారీ మోసానికి పాల్పడ్డాడు. పూర్తి కథనం

9. ‘మీ డిమాండ్లు కాదు... అన్న చేసినవి చెప్పండి’

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేసిన పనులు చెప్పకుండా.. మీ డిమాండ్లు చెబుతున్నారని హోంమంత్రి తానేటి వనిత ఆశా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలోని పార్టీ కార్యాలయంలో హోంమంత్రి, రాజమహేంద్రవరం పార్లమెంట్‌ వైకాపా అభ్యర్థి గూడూరి శ్రీనివాసరావులు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, ఆశా కార్యకర్తలు, వాలంటీర్లతో బుధవారం రాత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు వాలంటీర్లు అత్యుత్సాహం చూపారు. పూర్తి కథనం

10. కార్డ్‌ నెట్‌వర్క్‌ ఎంపిక.. వినియోగదార్ల ఇష్టం

డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డుల జారీ సమయంలో కార్డ్‌ నెట్‌వర్క్‌ను ఎంపిక చేసుకునే అవకాశం అర్హులైన వినియోగదార్లకు కల్పించాలని బ్యాంకులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆదేశించింది. కార్డ్‌ల వినియోగదారులకు ఈ నిర్ణయంతో ప్రయోజనం కలగనుంది. వినియోగదార్లు ఇతర కార్డ్‌ నెట్‌వర్క్‌ల సేవలను పొందకుండా షరతులు విధించే కార్డ్‌ నెట్‌వర్క్‌లతో ఒప్పందాలు కుదుర్చుకోవద్దని కూడా క్రెడిట్‌ కార్డులు జారీ చేసే సంస్థలకు ఆర్‌బీఐ సూచించింది. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు