Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 27 Nov 2022 09:11 IST

1. కివీస్‌తో రెండో వన్డే.. వర్షం అంతరాయం.. భారత్‌ 22/0 (4.5 ఓవర్లు)

 భారత్, న్యూజిలాండ్‌ రెండో వన్డే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్‌ను నిలిపేశారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా వర్షం కారణంగా ఆటను ఆపేసే సమయానికి 4.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (2*) మరీ నెమ్మదిగా ఆడుతుండగా.. శుభ్‌మన్ గిల్ (19*) కాస్త దూకుడు ప్రదర్శిస్తున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కళ్లు లేకున్నా.. బండి లోపం ఇట్టే పట్టేస్తారు!

అనూహ్య ఘటనల నేపథ్యంలో కంటిచూపు కోల్పోయినా వెరవక.. తాను నేర్చిన పరిజ్ఞానంతో ఆటో మెకానిక్‌గా ముందుకెళ్తున్నారు హఫీజ్‌. వరంగల్‌ కాశీబుగ్గకు చెందిన ఈయన తొలుత ఆటోనగర్‌లో ఎలక్ట్రీషియన్‌గా గుర్తింపు పొందారు. 2003లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎడమ కన్ను కోల్పోయారు. 2005లో దీపావళికి ఇంటి ముందు పేల్చిన టపాసుల కారణంగా కుడి కన్నూ పోగొట్టుకున్నారు. జీవితం నిండా కారుచీకటి కమ్ముకున్నా భయపడలేదు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘ఆప్‌’ కౌన్‌ హై?

గుజరాత్‌ ఎన్నికల ఫలితాలు గతంకంటే భిన్నంగా ఉంటాయో లేదోగాని... ప్రచారం మాత్రం విభిన్నంగా సాగుతోంది. ఎన్నడూ లేని... ఎక్కడా చూడని ఓ విచిత్ర పోకడ కనిపిస్తోంది. అదే- ప్రత్యర్థి ఉనికిని అస్సలు గుర్తించక పోవటం! వారి ఊసే ఎత్తకపోవటం! బలమైన ప్రత్యర్థిని అసలు ప్రత్యర్థేకాదన్నట్లుగా వ్యవహరించడం! ఈ ‘విస్మృత’ ఎత్తుగడ వేస్తోంది భాజపా, కాంగ్రెస్‌లైతే... ఆ ప్రత్యర్థి ఆమ్‌ ఆద్మీ పార్టీ! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. విద్యార్థులు తెలుగు పదాలు చదవలేకపోతే ఎలా?

‘కనీసం తెలుగు పదాలను కూడా సరిగా చదవలేకపోతున్నారు. ఇలా ఉంటే గిరిజన విద్యార్థులెలా బాగుపడతారు? ఈ పరిస్థితికి ఉపాధ్యాయులే బాధ్యత వహించాలంటూ’ రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ కుంభా రవిబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఎస్‌.కోట, వేపాడ మండలం కొండగంగుబూడిల్లో గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో పది, ఏడు తరగతుల విద్యార్థులతో పాఠ్యాంశాలను చదివించారు. ఆంగ్లం కాదు కదా కనీసం తెలుగు పదాలు చదవలేకపోవడంతో ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మాటల తూటాలు.. లాఠీ దెబ్బలు!

ఫ్రెండ్లీ పోలీసింగ్‌.. ఉన్నతాధికారుల ప్రసంగాలకే పరిమితమవుతోంది. కొందరు పోలీసులు అధికారపార్టీ నాయకులు, ఆర్థిక బలం ఉన్న వ్యక్తులతోనే ఫ్రెండ్లీగా ఉంటున్నారనే భావన ప్రజల్లో ఉంది. అయినవారితో ఒకలా.. కానివారితో మరోలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సమస్యలతో స్టేషనుకు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించి న్యాయం చేయాలని ఉన్నతాధికారులు చేస్తున్న సూచనలు చాలామంది పెడచెవిన పెడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

 6. నేతల సంకల్పసిద్ధి..!

కొత్త సంస్థ.. వ్యాపార అనుభవం లేదు.. కానీ ఆరు నెలలు.. మూడు రాష్ట్రాలు.. దాదాపు 20వేల మంది సభ్యులు.. రూ.250 కోట్లు  వసూలు.. కార్యాలయాలు లేవు.. ప్రచారం లేదు.. ఎలా సాధ్యం..? ఇవి పోలీసు లెక్కలు. అనధికారికంగా 25వేల మంది పైగా సభ్యులు.. సుమారు రూ.500 కోట్ల పైగా వసూలు అంచనా. దీని వెనుక సూత్రధారులు ఎవరు..? పది నెలల్లో సొమ్మును ఆరు రెట్లు చేస్తామని భారీ ఎత్తున డిపాజిట్లు సేకరించిన సంకల్పసిద్ధి సంస్థ వెనుక భారీ తలకాయలే ఉన్నట్లు తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఎవరికీ రాకూడదీ కష్టం

‘ఓటును అమ్ముకోబట్టే మాకీ పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో ఆ పని చేయబోం’ అని ప్రొద్దుటూరు పట్టణంలోని వాజ్‌పేయీ నగర్‌ వాసులు శపథం చేశారు. శనివారం రాజ్యాంగ దినోత్సవాన బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. నేతల ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు. చలిలో ఎలా జీవించేదంటూ బోరుమని విలపించారు. వస్తువులు కూడా తీసుకోనివ్వకుండా తమ ఇళ్లను అమాంతం కూల్చేశారని, కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని రోదించారు. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా వీధినపడేశారంటూ ఆక్రోశించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. 37 ఎకరాలు..1500 కోట్లు

భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌)కు చెందిన గచ్చిబౌలిలో అత్యంత విలువైన భూమిని మరోసారి వేలం వేయబోతున్నారు. ఈసారి 37 ఎకరాలను విక్రయించాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ నిర్ణయించింది. తద్వారా రూ.1500 కోట్ల ఆదాయం రాబట్టుకోవచ్చనేది అంచనా. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న భూమి నగదీకరణ విధానాన్ని అనుసరించి దేశంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన భూములను విక్రయించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం దేశవ్యాప్తంగా మొదటి దశలో ఆరు స్థిరాస్తులను గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. క్షేమంగా వెళ్లొద్దాం అయ్యప్పా

 కొవిడ్‌ అంతరాయాలతో గత రెండేళ్లుగా శబరిమల వెళ్లలేకపోయిన భక్తులు.. ఈసారి మండల పూజలు ప్రారంభమైన నవంబరు 16 నుంచే పెద్దఎత్తున అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్తున్నారు. 41 రోజుల దీక్ష చేసిన వారితో పాటు.. మాలధారణ చేయకుండా దర్శనానికి వెళ్లేవారూ ఎక్కువగానే ఉంటున్నారు. ఒక్క మండల కాలం (నవంబరు 16- డిసెంబరు 27)లోనే 4 కోట్ల మందికి పైగా శబరిమలకు వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో మాలధారణ చేసిన బాలలు తప్పిపోకుండా కేరళ పోలీసులు వేస్తున్న ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లు ఈసారి ఎంతగానో ఉపకరిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇసుక గూడు కట్టాలన్నా కష్టమే!

ఉమ్మడి జిల్లాలో 80 శాతం పేదల లేఅవుట్లలో కనీస వసతులు సమకూరకపోవడంతో లబ్ధిదారులకు గృహయోగం దక్కడం లేదు. నీరు, విద్యుత్తు సౌకర్యాలు ఎలా ఉన్నా కనీసం గృహనిర్మాణ సామగ్రి తరలించేందుకు రహదారులు లేకపోవడంతో ఇళ్ల నిర్మాణంలో పురోగతి కనిపించడం లేదు. లక్ష్యం లక్షల్లో ఉండగా నిర్మాణం పూర్తయినవి 20శాతం కూడా లేవు. కలెక్టర్లు తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నా క్షేత్రస్థాయిలో ఫలితం కనిపించడం లేదని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని