Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 27 Feb 2024 21:33 IST

1. కేటీఆర్‌కు సీఎం రేవంత్‌ సవాల్‌

భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో చేవెళ్లలో నిర్వహించిన ‘జనజాతర’ సభలో ఆయన మాట్లాడారు. ‘‘రేవంత్‌ పేరు చెబితే.. 3 సీట్లు కూడా వచ్చేవి కావని కేటీఆర్‌ చెప్పారు. ఆయనకు చేవెళ్ల సభ నుంచి సవాల్‌ విసురుతున్నా. దమ్ముంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భారాసకు ఒక్క సీటయినా గెలిపించి చూపించాలి’’ అని అన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏపీ రాజధాని అమరావతే.. అందులో చర్చే లేదు: రాజ్‌నాథ్‌

వైకాపా సర్కారు దౌర్జన్యాలపై పోరాటం చేసి నిలువరించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) పిలుపునిచ్చారు. ప్రజాక్షేత్రం నుంచి సాగించే ఉద్యమాలు, ఆందోళనల ద్వారా ప్రజల్లోకి పార్టీ బలంగా వెళ్తుందని భాజపా శ్రేణులకు కర్తవ్యబోధ చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. చంద్రబాబుతో లావు శ్రీకృష్ణదేవరాయలు, పలువురు ఆశావహుల భేటీ

తెలుగుదేశం అధినేత చంద్రబాబును నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలో ఆయన తెదేపాలో చేరనున్నారు. పల్నాడు జిల్లా అభివృద్ధి కోసం మళ్లీ పోటీ చేయబోతున్నట్లు ఇప్పటికే శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా మళ్లీ ప్రజల ముందుకొస్తున్నానని తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. లోక్‌సభ బరిలో శైలజ టీచర్‌

లోక్‌సభ ఎన్నికల సమరానికి సమయం సమీపిస్తున్న వేళ కేరళలో అధికార సీపీఎం తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 20 లోక్‌సభ స్థానాలు ఉండగా.. మంగళవారం 15 స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. వీరిలో మాజీ మంత్రులు కేకే శైలజ, టీఎం థామస్‌ ఐజక్‌ ఉన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. త్వరలో భాజపాలోకి వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి?

భాజపా లోక్‌సభ కోర్‌ కమిటీ భేటీ వద్ద వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రత్యక్షం కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. విజయవాడలో జరుగుతున్న ఈ సమావేశానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ హాజరయ్యారు. ఈ క్రమంలో రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్లి రాజ్‌నాథ్‌తోపాటు భాజపా రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరిని కలిశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. 20 మంది వైకాపా నేతలకు గన్‌మెన్ల తొలగింపు

కడప జిల్లాలో 20 మంది వైకాపా నేతలకు అనధికారికంగా ఇచ్చిన గన్‌మెన్‌లను ప్రభుత్వం తొలగించింది. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలకు భద్రత కల్పించే అంశంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ ఎన్నికల సంఘం (ఈసీ)కి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కష్టకాలంలో ద్రవిడ్‌ సహకారాన్ని మర్చిపోను: గిల్‌

నాలుగో టెస్టులో విజయం సాధించి టీమ్‌ఇండియా సిరీస్‌ సొంతం చేసుకున్న సందర్భంగా భారత యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్ (Rahul Dravid) గురించి ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. తనను నిరంతరం ప్రోత్సహించేది ఆయనే అంటూ ద్రవిడ్‌ చెప్పిన మాటలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశాడు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పతంజలి ఆయుర్వేదపై సుప్రీంకోర్టు ఆగ్రహం

యోగా గురువు రామ్‌దేవ్‌ బాబాకు చెందిన పతంజలి (Patanjali) ఆయుర్వేద సంస్థపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది. కంపెనీ ఉత్పత్తుల ప్రచారం, వాటి సామర్థ్యానికి సంబంధించిన ప్రకటనల విషయంలో కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘించడంపై జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ అమనుల్లాతో కూడిన ధర్మాసనం మండిపడింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. లోక్‌పాల్‌ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్‌

లోక్‌పాల్ (Lokpal)’ ఛైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్‌ (A M Khanwilkar) నియమితులయ్యారు. రాష్ట్రపతి భవన్ మంగళవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. 2022 మేలో భారత తొలి లోక్‌పాల్‌ జస్టిస్ పినాకి చంద్రఘోష్ పదవీకాలం పూర్తయినప్పటినుంచి ఈ స్థానం ఖాళీగా ఉంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నౌక మునక.. 120 ఏళ్లకు వీడిన మిస్టరీ!

దాదాపు 120 ఏళ్ల క్రితం సముద్రంలో అదృశ్యమైన ఓ నౌక ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. ఆస్ట్రేలియా (Australia) తీరంలో సముద్రగర్భంలో దాన్ని గుర్తించారు. అధికారుల వివరాల ప్రకారం.. ‘ఎస్‌ఎస్‌ నెమెసిస్‌ (SS Nemesis)’ అనే నౌక 1904లో బొగ్గు లోడుతో న్యూక్యాసెల్‌ నుంచి మెల్‌బోర్న్‌కు బయల్దేరింది. మార్గమధ్యలో న్యూసౌత్‌వేల్స్‌ (NSW) తీరంలో భారీ తుపాను ధాటికి నీట మునిగింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని